చంద్రబాబుతో బోయపాటి శ్రీను భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను బుధవారం భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. కాగా గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా బోయపాటి...తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుపై షార్ట్ ఫిల్మ్ తీసిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ జరిగిన తొక్కిసలాటలో 30మంది మృత్యువాత పడ్డారు.
తాజాగా కృష్ణా పుష్కరాల హారతికి సంబంధించి బోయపాటే డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. నటుడు సాయికుమార్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.