
పుష్కరాలకు విచ్చేయనున్న సూపర్ స్టార్
కృష్ణా పుష్కరాలలో పవిత్ర స్నానం ఆచరించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ గుంటూరు విచ్చేయనున్నారు. పుష్కరాలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది. త్వరలో రజనీకాంత్ గుంటూరులోని చింతపల్లిలో ఉన్న విష్ణు పంచాయతన దివ్య మహా పుణ్య క్షేత్రానికి చేరుకుని పవిత్ర పుష్కర స్నానం ఆచరించనున్నారు.
గతేడాది గోదావరి పుష్కరాలకే ప్రభుత్వం రజనీకి ఆహ్వానం పంపినప్పటికీ.. ఆ సమయంలో ఆయన రాలేకపోయారు. కృష్ణా పుష్కరాలకు రజనీ హాజరవుతారని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది.
అనంతరం రజనీ ఓ నెల రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' రెండవ దశ షూటింగ్లో పాల్గొంటారు. రోబో 2.0లో బాలీవుడ్ రుస్తుం అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.