పుష్కరాలకు వచ్చే రైతులకు లఘుచిత్రాల ప్రదర్శన | formers film dacumentary | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు వచ్చే రైతులకు లఘుచిత్రాల ప్రదర్శన

Published Sun, Aug 14 2016 10:00 PM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

formers film dacumentary

రాయవరం :
కృష్ణా పుష్కరాల్లో పశు సంవర్ధక శాఖకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించేందుకు రిసోర్స్‌ పర్సన్‌గా తనను ప్రభుత్వం నియమించినట్లు రాయవరం పశువైద్యశాల ఏడీ డాక్టర్‌ ఎం.రామకోటేశ్వరరావు తెలిపారు. రాయవరంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈమేరకు పశు సంవర్ధక శాఖ సంచాలకుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆయన తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 16, 17 తేదీల్లో పశు సంవర్ధకశాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పశుయాజమాన్యంపై రూపొందించిన లఘుచిత్రాలను అక్కడ తాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ టీమ్‌లో జిల్లా నుంచి డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.గాబ్రియేల్, పామర్రు, ఆలమూరు, రాజమండ్రి వెటర్నరీ డాక్టర్లు‡ జాన్‌పాల్, ఓ.రామకృష్ణ, కె.సత్యనారాయణ, అమలాపురం ఏడీ డాక్టర్‌ ఎల్‌.అనితలు ఉన్నట్టు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement