
'పుష్కరాలను ప్రచారం కోసం వాడుకుంటున్న బాబు'
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా ఆదివారం చిత్తూరులో నిప్పులు చెరిగారు. కృష్ణా పుష్కరాలను చంద్రబాబు తన ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. పుష్కర ఘాట్ల వద్ద కనీస వసతులు లేవని విమర్శించారు. చాలా ఘాట్లలో నీరు లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పురాతన ఆలయాలను కూల్చి మరుగుదొడ్లు నిర్మించడం దారుణమన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబుతోపాటు ఆయన అనుయాయులు వేల కోట్లు దోపిడీ చేశారని రోజా విమర్శించారు.