పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష
Published Tue, Aug 2 2016 6:44 PM | Last Updated on Sat, Jul 28 2018 4:52 PM
విజయవాడ: కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమర్ధంగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు, అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వుంటుందని చంద్రబాబు సమీక్ష సమావేశంలో హెచ్చరించారు. బుధవారం నుంచి ప్రతిరోజూ పుష్కర ఘాట్ల పనులను పరిశీలించనున్నట్లు ఆయన వెల్లడించారు. పుష్కరాల సమయంలో విజయవాడ నగరంలో అపరిశుభ్రతకు ఎక్కడా తావు వుండకూడదని అధికారులకు ఆదేశించారు.
అలాగే పుష్కరాలకు వచ్చే వీఐపీలు, భక్తుల ఆహ్లాదం కోసం హెలికాప్టర్, బోట్లను సిద్ధం చేయాలని సూచించారు. అధికారులు ఈ సందర్భంగా పుష్కరాలపై తుది దశకు చేరుకున్న పనులను ముఖ్యమంత్రికి వివరించారు. కాగా కృష్ణా పుష్కరాలపై ఈ నెల 6న మరోసారి చంద్రబాబు అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. మరోవైపు ఈనెల 11న రాజమహేంద్రవరంలో జరిగే గోదావరి అంత్య పుష్కరాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. గోదావరికి హారతి ఇవ్వడం పూర్తి కాగానే, నేరుగా విజయవాడలో కృష్ణా పుష్కరాల కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరవుతారు.
Advertisement