godavari antya pushkaralu
-
రాజమహేంద్రవరంలో పోటెత్తిన భక్తులు
రాజమహేంద్రవరం: గోదావరి అంత్యపుష్కరాలు సోమవారం తొమ్మిదో రోజుకు చేరాయి. పుణ్యస్నానం ఆచరించడానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్లన్ని భక్తులతో కిటకిటలాడాయి. అయితే గోదావరిలోకి వరద నీరు భారీగా తరలి వస్తుంది. ఈ నేపథ్యంలో నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. నదిలో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులకు పలు హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, గన్నవరం, పెరవలి మండలం తీపర్రు, పెనుగొండ మండలం సిద్ధాంతం, నిడదవోలు మండలం పెండ్యాలతో పాటు కోవ్వూరులోని గోష్పాద క్షేత్రాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు భారీగా తరలి వచ్చారు. కోవ్వూరులో సోమవారం వేకువజాము నుంచి గౌతమి ఘాట్‌లో దాదాపు 50వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. గోదావరి వరద ఉధృతి కారణంగా మూడు ఘాట్లలో రెండింటిని అధికారులు మూసివేశారు. ఈ నెల 11వరకు అంత్య పుష్కరాలు కొనసాగుతాయి. -
పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష
విజయవాడ: కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమర్ధంగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు, అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వుంటుందని చంద్రబాబు సమీక్ష సమావేశంలో హెచ్చరించారు. బుధవారం నుంచి ప్రతిరోజూ పుష్కర ఘాట్ల పనులను పరిశీలించనున్నట్లు ఆయన వెల్లడించారు. పుష్కరాల సమయంలో విజయవాడ నగరంలో అపరిశుభ్రతకు ఎక్కడా తావు వుండకూడదని అధికారులకు ఆదేశించారు. అలాగే పుష్కరాలకు వచ్చే వీఐపీలు, భక్తుల ఆహ్లాదం కోసం హెలికాప్టర్, బోట్లను సిద్ధం చేయాలని సూచించారు. అధికారులు ఈ సందర్భంగా పుష్కరాలపై తుది దశకు చేరుకున్న పనులను ముఖ్యమంత్రికి వివరించారు. కాగా కృష్ణా పుష్కరాలపై ఈ నెల 6న మరోసారి చంద్రబాబు అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మూడు జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. మరోవైపు ఈనెల 11న రాజమహేంద్రవరంలో జరిగే గోదావరి అంత్య పుష్కరాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. గోదావరికి హారతి ఇవ్వడం పూర్తి కాగానే, నేరుగా విజయవాడలో కృష్ణా పుష్కరాల కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరవుతారు. -
'గోదావరి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు'
కాకినాడ: గోదావరి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప వెల్లడించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్ చినరాజప్ప విలేకర్లతో మాట్లాడుతూ... హైకోర్టు విభజన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తాననడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తగదన్నారు. తెలుగు రాష్ట్రాలు సీఎంలు, కేంద్రం కూర్చుని చర్చిస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని చినరాజప్ప తెలిపారు.