గోదావరి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప వెల్లడించారు.
కాకినాడ: గోదావరి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్ చినరాజప్ప వెల్లడించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్ చినరాజప్ప విలేకర్లతో మాట్లాడుతూ... హైకోర్టు విభజన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తాననడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తగదన్నారు. తెలుగు రాష్ట్రాలు సీఎంలు, కేంద్రం కూర్చుని చర్చిస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని చినరాజప్ప తెలిపారు.