చిత్తూరు : ఎర్రచందనం స్మగ్లింగ్లో కొందరు రాజకీయ నేతలు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్. చినరాజప్ప వెల్లడించారు. ఎలాంటి వారినైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుడిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం వెలుపల చినరాజప్ప విలేకర్లతో మాట్లాడారు.
ఈ స్మగ్లింగ్లో పోలీసుల హస్తం ఉన్నట్లు తెలిసే వారని ఉపేక్షించమని తెలిపారు. ఆ తర్వాత మదనపల్లిలో గాలివానకు దెబ్బతిన్న ప్రాంతాలను చినరాజప్ప పరిశీలించారు. విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని... పంటలు కొల్పోయిన రైతులకు రెండు, మూడు రోజుల్లో పరిహరం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.