అనంత తాగు నీటి సమస్య పరిష్కరానికి చర్యలు
అనంతపురం : అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి ఎన్ చినరాజప్ప అనంత వాసులకు హామీ ఇచ్చారు. శుక్రవారం చినరాజప్ప అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాప్తాడు మండలంలోని వేరుశనగ పంటను ఆయన పరిశీలించారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ.... జిల్లాలో 7లక్షల హెక్టార్లకుగాను, 2.3లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోనే వేరుశనగ పంట సాగుచేశారని చెప్పారు.
మిగిలిన భూముల్లో ఇతర పంటలు సాగుచేశారన్నారు. కాగా, వేరుశనగ పంట సాగు పెరిగినప్పటికి వర్షాభావ పరిస్థితుల్లో వేరుశనగ కాయలు పెరగలేదని చెప్పారు. తద్వారా 2.3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట చేతికొచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. జిల్లాలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగు నీటి సమస్య కూడా ఏర్పడిందని మంత్రి చినరాజప్ప అన్నారు.