హైదరాబాద్ : కృష్ణా పుష్కరోత్సవాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరస్నానమాచరిస్తున్నారు. అదికాక నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు పలు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
దీంతో వివిధ ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసింది.