pushkar ghats
-
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, కర్నూలు : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు నేడు (శుక్రవారం) ఘనంగా ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని, అప్పటి నుంచి పుణ్యఘడియలు ప్రారంభమవుతాయని పండితులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు.. తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది. కర్ణాటకలో ప్రవహించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం మేళిగనూరు(నదిచాగి) వద్ద ఆంధ్రలో ప్రవేశిస్తుంది. 156 కిలోమీటర్ల మేర మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాలలో ప్రవహించాక కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. నది పరివాహక ప్రాంతంలో 23 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఘాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుష్కరాలకు అనుమతి ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరఘాట్ల వరకూ 43 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఘాట్ల వద్ద తాత్కాలిక బస్షెల్టర్లను ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదిలో ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. పుష్కరాల సమయంలో నీటి సమస్య లేకుండా చూసేందుకు అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. స్నానాలకు అనుమతి లేదు.. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండటం, రెండో దశ మొదలవ్వడం, నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులు నదిలో పుష్కరస్నానాలు ఆచరించేందుకు అనుమతి నిరాకరించింది. అయితే పిండప్రదానాలకు అవకాశం కల్పించింది. ఈ–టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి అనుమతి ఇచ్చింది. ఈ–టికెట్ వెబ్సైట్ (https://tungabhadrapushkaralu 2020.ap.gov.in)ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యేలు గురువారం కర్నూలు జిల్లా కలెక్టరేట్లో ప్రారంభించారు. వెబ్సైట్ ద్వారా భక్తులు తమకు నచ్చిన పుష్కర ఘాట్లలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సంప్రదాయ పూజలకు, పిండప్రదానాలకు 23 ఘాట్లలో 350 మంది పురోహితులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో పురోహితుడు రోజుకు 16 స్లాట్ల చొప్పున (ఒక్కో స్లాట్‌లో ఇద్దరు) పూజలు చేస్తారు. ఈ టికెట్ బుక్ చేసుకోకుండా నేరుగా వస్తే పిండప్రదానాలకు అనుమతి ఉండదు. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో నిర్వహించినట్లుగా ఇప్పుడు కూడా పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు అన్ని ఘాట్లలో గంగాహారతి ఇవ్వనున్నారు. కాగా, సీఎం పర్యటన సందర్భంగా సంకల్‌భాగ్ వీఐపీ పుష్కర ఘాట్‌లో ఏర్పాట్లను మంత్రులు బుగ్గన, జయరాం, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ పరిశీలించారు. నాడు తండ్రి.. నేడు కుమారుడు.. గత తుంగభద్ర పుష్కరాలు 2008 డిసెంబర్ 10న ప్రారంభమయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డిసెంబర్ 11న కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నదికి హారతి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంకల్‌భాగ్ ఘాట్‌లోనే పుష్కరాలు ప్రారంభించనున్నారు. తండ్రి, తనయులు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో వరుస పుష్కరాలు రావడం అరుదైన ఘట్టంగా భక్తులు భావిస్తున్నారు. పుష్కరాలను విజయవంతం చేయాలి: వీరపాండియన్, కలెక్టర్, కర్నూలు కోవిడ్ నేపథ్యంలో కఠిన పరిస్థితుల్లో పుష్కరాలు నిర్వహిస్తున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అత్యంత భక్తిభావంతో నిర్వహిస్తాం. ఈ–టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారు పిండప్రదానాలు చేసుకోవచ్చు. పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు సహకరించాలి. కేంద్ర నిబంధనలతో నియంత్రణ చర్యలు: మంత్రి వెలంపల్లి కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్లే తుంగభద్ర పుష్కరాల్లో కొన్ని నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, భక్తులు సహకరించాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. భక్తులకు ఉచితంగా అందజేసే ఈ–టికెట్ విధానంలో భక్తులు ఏ సమయంలో ఏ ఘాట్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనే వివరాలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గోదావరి, కృష్ణా పుష్కరాలకు రూ. వేల కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడితే, తమ ప్రభుత్వం అవసరమైన మేరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పూర్తిగా పొదుపుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ పుష్కరాల్లో భక్తుల పుణ్య స్నానాలకు అనుమతి తెలపలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పేదలకు డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే.. ఆరోజు క్రిస్మస్ అంటూ కొందరు విమర్శలు చేయడం సరికాదని, ఆరోజు ముక్కోటి ఏకాదశి పండుగ కూడా అనే విషయం విమర్శ చేసే వారికి తెలియకపోవచ్చని ఎద్దేవా చేశారు. -
పుష్కర ఘాట్లలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
హైదరాబాద్ : కృష్ణా పుష్కరోత్సవాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరస్నానమాచరిస్తున్నారు. అదికాక నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు పలు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసింది. -
అదిగో పుష్కరం.. ఎప్పటికి పరిష్కారం?
వారంలో పుష్కరాలు ప్రారంభం కానుండగా కీలకమైన ఘాట్ల నిర్మాణ పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. ఏ+ కేటగిరీలో మొదటి వరుసలో ఉన్న దుర్గాఘాట్‌లో ఇంకా టైల్స్ కూడా వేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పున్నమి ఘాట్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉండగా, సీతానగరం ఘాట్లలో కొన్నింటినీ మాత్రమే పూర్తిచేసి మమ.. అనిపించారు. ప్రస్తుతం వీటి పనులు చూస్తే పుష్కరాల నాటికి అందుబాటులోకి వచ్చేది సందేహమే.. విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గాఘాట్‌లో పనులు ఇంకా కొలిక్కి రాలేదు. పుష్కర స్నానానికి భక్తులు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ ఘాట్‌లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల తీరుపై కలెక్టర్ బాబు.ఏ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మార్పు రాలేదు. మే 15వ తేదీన దుర్గాఘాట్‌లో పనులు ప్రారంభించగా, రెండు నెలలో పూర్తికావాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంతవరకు నదిలో ఘాట్ నిర్మాణం మాత్రమే పూర్తికాగా, కొంతమేర మెట్లు నిర్మించారు. మెట్లకు టైల్స్ పనులే ఇంకా ప్రారంభం కాలేదు. వారం రోజులే గడువుండగా, పనులు ముందుకు సాగకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీఐపీ ఘాట్ కానందుకేనా..? దుర్గాఘాట్‌కు ఆనుకుని గతంలో వీఐపీ ఘాట్ ఉండేది. పుష్కర పనుల్లో భాగంగా వీఐపీ ఘాట్‌ను ఆధునికీకరించి దుర్గాఘాట్‌లో కలిపేశారు. దీంతో సీఎంతో పాటు ఇతర మంత్రులు దుర్గాఘాట్‌లోనే పుష్కర స్నానం చేస్తారని అందరూ భావించారు. అయితే, వీఐపీ ఘాట్‌ను సంగమం వద్దకు మార్చడంతో దుర్గాఘాట్‌లో పనులు నత్తనడకన జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం దుర్గాఘాట్‌లోని పాత మెట్లకు ఎగువన, దిగువన కొత్తగా మెట్లు నిర్మిస్తున్నారు. రావిచెట్టు వద్ద పనులు తొలి దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవిత్ర సంగమం వద్ద వీఐపీలు పుష్కర స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పుష్కర పనుల ప్రారంభం సమయంలో దుర్గాఘాట్‌లోనే వీఐపీలు స్నానాలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు ప్రకటించారు. అయితే, ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం, ఆ పక్కనే నమూనా దేవాలయాలు ఉండటంతో వీఐపీలు ఇక్కడే స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దుర్గాఘాట్‌కు దిగువన ఉన్న పద్మావతి, కృష్ణవేణి ఘాట్లలో పనులు దాదాపు ముగింపు దశకు చేరాయి. కృష్ణవేణి ఘాట్ అటు బస్టాండ్‌కు , ఇటు రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో ఉండటంతో భక్తులు ఎక్కువగా అక్కడికే వచ్చే అవకాశాలున్నాయని భావించిన జిల్లా కలెక్టర్ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ పర్యవేక్షణ దుర్గాఘాట్‌లో పనులను ఈనెల మొదటికి పూర్తి చేయాలని కలెక్టర్ బాబు.ఏ అధికారులను ఆదేశించారు. అయితే, దాదాపు 50 శాతం పనులు కూడా పూర్తి కాకపోవడంతో మరో 5 రోజులు గడువు పొడిగించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ బాబు.ఏ దుర్గాఘాట్‌లో పనులు పరిశీలించేందుకు విచ్చేసిన క్రమంలో ఘాట్‌లో ఒక్కరు కూడా పనిచేసే వారు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పనులు వేగవంతం చేసేందుకు సిద్ధమైనా ఉదయం నుంచి కురిసిన వర్షంతో నత్తనడకన కొనసాగాయి. మధ్యాహ్నం నుంచి కాసింత తెరిపి ఇవ్వడంతో పనులు ప్రారంభించారు. అయితే, వారం రోజుల్లో దుర్గాఘాట్‌లో ఏ మేరకు పనులు పూర్తవుతాయనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి
బాల్కొండ/మోర్తాడ్/రెంజల్ : అంత్య పుష్కరాల రెండో రోజు సోమవారం భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రంలో 2, 4 ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. నదిలోని పురాతన శివాలయం వద్ద భక్తులు పూజలు చేశారు. మోర్తాడ్ మండలంలోని తడపాకల్, బాల్కొండ మండలంలోని ఎస్సారెస్పీ పుష్కర ఘాట్ల వద్ద కూడా సోమవారం సందడి కనిపించింది. ఎస్సారెస్పీ పుష్కర ఘాట్లకు భక్తులు తరలివచ్చారు. సమీపంలోని కోదండ రామాలయంలో పూజలు చేశారు. మహంకాళి ఆలయంలో రెండో రోజూ నవ చండీ యాగం కొనసాగింది. -
పనులు నాణ్యంగా చేయాలి
కొల్లాపూర్ రూరల్ : కృష్ణా పుష్కర ఘాట్ల పనులు వేగవంతంగా, నాణ్యంగా చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్ మండలంలోని అమరగిరి, సోమశిలలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్లు, రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ఘాట్ల ఆవరణలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. అనంతరం సోమశిల శివారులోని సోమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్న నిరంజన్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి కృష్ణయ్య, పీఆర్ ఈఈ రాములు, ఏఈ విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'31లోగా పుష్కర ఘాట్లు పూర్తిచేస్తాం'
- పుష్కర విధుల్లో 3వేలకు పైగా సిబ్బంది - ఆగస్టు 8న ట్రైల్ రన్ - 18న సీఎం పర్యటన ఖరారు - జిల్లా కలెక్టర్ విజయమోహన్ శ్రీశైలం: పుష్కర ఘాట్ల నిర్మాణం పనులు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ధీమా వ్యక్తం చేశారు. సంగమేశ్వరంలో పనులు వేగంగా జరుగుతున్నాయని, శ్రీశైలం, లింగాలగట్టు ప్రాంతాల్లో కొంత మందగమనం ఉందన్నారు. ఆగస్టు 8న పుష్కర ఘాట్ల ట్రైల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం జిల్లా ఎస్పీతో కలిసి ఆయన శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్లను పరిశీలించారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరగాల్సిన పనులు ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఘాట్లను అందుబాటులోకి తీసుకురాకపోతే సస్పెన్షన్ ఉత్తర్వులు తప్పవని హెచ్చరించారు. ఘాట్ల సందర్శన అనంతరం ఆయన నేరుగా పార్కింగ్ స్థలాల కోసం కేటాయించిన యజ్ఞవాటిక, హెలిపాడ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ రవికృష్ణలు దేవస్థానం పరిపాలనా భవనంలోని సమావేశంలో మందిరంలో జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల నుంచి తరలివచ్చిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలంలో పుష్కర నగర్ పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడో ఒక చోట క్లాక్ రూములు, మరెక్కడో మరుగుదొడ్లు, బాత్రూమ్లు ఉండకుండా అన్ని ఒకేచోట ఉండే విధంగా పుష్కర నగర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కర నగర్లో వాటర్‌ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేస్తామని, దానికి సమీపంలోనే వారికి అన్ని వసతులు అందుబాటులో ఉండేలాగున చూస్తామన్నారు. సుమారు 3వేల మంది భక్తులకు పుష్కర నగర్లో తాత్కాలిక విడిది చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పార్కింగ్ స్థలం నుంచి భక్తులను ఘాట్లకు చేర్చేందుకు షటిల్ సర్వీస్ బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందన్నారు. వాహనాలు నిలుపుకునేందుకు 15 పాయింట్ల అవసరమవుతాయని గుర్తించామని, అక్కడ ఆల్ట్రామోడ్రన్, సెల్ఫ్ క్లీనిక్ టాయిలెట్లు పెట్టించాల్సిందిగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. 18న ముఖ్యమంత్రి శ్రీశైలం రాక శ్రీశైలం మహాక్షేత్రంలో పుష్కర పనులను పరిశీలించడానికి ఈ నెల 18 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నట్లు సమాచారం అందిందని కలెక్టర విజయమోహన్ తెలిపారు. అందుకోసం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని ల్యాండ్ అవడానికి హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. భారీ బందోబస్తు : ఎస్పీ కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. కలెక్టర్ సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరుల మాట్లాడుతూ సీఎం పర్యటన ఈ నెల 18న ఉన్నందున ఇప్పటికే కూంబింగ్ దళాలు నల్లమల ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నాయన్నారు. గతంలో జరిగిన సమావేశంలో 22 అంశాలను మినిట్స్‌లో సూచించామని, అయితే ఇప్పటి వరకు అవి అమలు కాలేదన్నారు. క్లాక్ రూమ్ వద్ద బ్యాగెజ్ ఎక్స్‌రే, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద స్కానర్ల ఏర్పాటు మొదలైనవి సూచించామన్నారు. క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి రక్షణ ఇచ్చే విధంగా పోలీసుల విధి నిర్వహణ ఉంటుందని అన్నారు. -
ప్రభుత్వ వైఫల్యమే కారణం
రాజమహేంద్రవరం క్రైం : రూ.10 కోట్ల రూపాయలతో వీఐపీ ఘాట్ నిర్మించి, ముఖ్యమంత్రిని పుష్కర ఘాట్‌లోకి ఎలా అనుమతించారని న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు నిలదీశారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పుష్కర తొక్కిసలాటపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అఫిడవిట్లు వేసిన న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు ఆనాటి సంఘటనకు సంబంధించి సమర్పించిన వివిధ చానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను, ఆధారాలను జస్టిస్ సోమయాజులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ప్రభుత్వ శాఖలకు ఆధారాలు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నామని, ఆధారాలు సమర్పించకపోతే సమన్లు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఈ విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు తన వాదనలు వినిపిస్తూ, భారీ జనం ఉన్న ప్రాంతాల్లో ప్రముఖులు ప్రవేశించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, లక్షలాది మంది ఉన్న పుష్కర ఘాట్‌లోకి ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కువ సేపు ఘాట్‌లో ఉండిపోవడం వల్లే గేట్లు మూయాల్సి వచ్చిందని, ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఎక్కువ సేపు క్యూలో నిలబడిన భక్తులు ఘాట్‌లోకి ప్రవేశించిన క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుందని పేర్కొన్నారు. చిన్న గేటుకు తోడు ఏడు మెట్లు ఘాట్ మొదట్లో ఉన్నాయని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అవి కనిపించకపోవడంతో ఒకరిపై మరొకరు పడి నలిగిపోయారని వివరించారు. మతపర కార్యక్రమాల్లో సీఎం పాల్గొనరాదు భారత రాజ్యాగం ప్రకారం మత సంబంధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనకూడదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు టి.అరుణ్ కమిషన్‌కు వివరించారు. మరో న్యాయవాది శ్రీనివాస్ తన వాదన వినిపిస్తూ ఒకటిన్న కి.మీ. కోటిలింగాల ఘాట్ ఉండగా, ముఖ్యమంత్రిని ఇరుకుగా ఉన్న పుష్కర ఘాట్‌లోకి అనుమతించడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని, పుష్కరాలకు స్పెషల్ ఆఫీసర్‌గా పని చేసిన ధనుంజయరెడ్డిని కమిషన్ విచారణ చేయాలని కోరారు. విచారణలో కమిషన్‌కు సహాయకుడిగా మద్దూరి శివసుబ్బారావు వ్యవహరించారు. ప్రభుత్వ ప్లీడర్ చింతపెంట ప్రభాకరరావు తన వాదనలు వినిపించారు. నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శిక్షించకపోగా..అవార్డులు ఇచ్చారు : ఉండవల్లి పుష్కర తొక్కిసలాటలో తొలి రోజు 29 మంది మరణించి, 52 మంది గాయాలపాలయ్యారని, ఈ సంఘటనలో ఎవరినీ సస్పెండ్ చేయకపోగా, పుష్కరాలు ముగిసిన అనంతరం అధికారులకు ముఖ్యమంత్రి అవార్డులు ఇచ్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. 2005 కృష్ణా పుష్కరాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్‌లో రెయిలింగ్ పడిపోయిన సంఘటనలో ఐదుగురు మరణించగా, కలెక్టర్‌ను, ఎస్పీని, ఈఈని సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు దీనికి పూర్తి విరుద్ధంగా పుష్కరాలు ముగిసిన అనంతరం అధికారులకు అవార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఆక్సిజన్, మంచినీరు సరఫరా చేసినా మరి కొందరు బతికేవారని చెప్పారు. ఈ సంఘటనకు పూర్తిగా ముఖ్యమంత్రే కారణమని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో తానే ఐ విట్నెస్ అని చెప్పారని, ఆయనను, కలెక్టర్, ఎస్పీలను కమిషన్ ముందు ప్రవేశపెట్టి, విచారణ జరపాలని కోరారు. -
‘సెల్’ రేగిపోతున్నారు
రాజమండ్రి : గోదావరి స్నాన ఘట్టాల వద్ద చోరుల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా సెల్ఫోన్లు క్షణాల్లో మాయమవుతున్నాయి. యాత్రికులు పుష్కర స్నానం చేసేందుకు వస్త్రాలను మెట్లపై వదిలి తమ వారిని కాపలా ఉంచినా.. రద్దీలో చోరులు అదును చూసి సెల్ఫోన్లు కొట్టేస్తున్నారు. వీఐపీ ఘాట్‌లో ఈ పది రోజుల్లో సుమా రు 45 మంది యాత్రికులు సెల్ఫోన్లు పోట్టుకున్నారు. ఇదే సమస్య గోదావరి తీరాన ఉన్న ప్రతి ఘాట్లోనూ ఉంది. బుధవారం రాజమండ్రిలోని ఒక నెట్వర్క్ కార్యాలయానికి సుమారు 50 మంది యాత్రికులు చేరుకుని తమ సెల్ఫోన్లు పోయాయని, సిమ్‌లను రిప్లేస్ చేయాలని దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. -
పుష్కరాల్లో 91 మంది అదృశ్యం
33 మంది ఆచూకీ లభ్యం రాజమండ్రి : గోదావరి పుష్కరాల ప్రారంభం రోజు నుంచి ఆరు రోజుల పాటు వివిధ ఘాట్లు, ప్రాంతాల్లో 91 మంది అదృశ్యమైనట్టు అధికారులు తెలిపారు. వారిలో 33 మంది ఆచూకీ లభించడంతో బంధువులకు అప్పగించామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు మూడు రోజుల పాటు రాజమండ్రిలోనే ఉండిపోయి, తమ బంధువుల గురించి నగరమంతా వెతుకుతున్నాడు. మూడు రోజుల అనంతరం స్థానిక ప్రజలను అడిగి తమ వారికి ఫోన్ చేయడంతో వారు నగరానికి చేరుకుని తీసుకెళ్లారు. అలాగే సోమవారం మల్లయ్య పేట దుర్గమ్మ గుడి వద్ద మూడేళ్ల పాప తప్పిపోయింది. ఆ ప్రాంతంలో ఏడుస్తూ తిరుగుతుండడంతో స్థానికులు చేరదీసి టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించారు. ఒక పాత్రికేయుడు పాప కోసం స్థానిక దుర్గాదేవి గుడి వద్ద గల మైక్‌లో ఎనౌన్స్ చేయడంతో ఆ చుట్టుపక్కలే పాప కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు ఏడుస్తూ పాప వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. తప్పిపోయిన తమ బంధువుల కోసం పోలీసు ఫిర్యాదులు చేయకుండా వందలాది మంది వెతుకుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం, లోపుకంచి గ్రామానికి చెందిన భార్యాభర్తలు మజ్జి ఆప్పయ్య, మజ్జి చవిటమ్మ ఆచూకీ ఇప్పటివరకూ లభించలేదు. ఇలా పోలీసులకు ఫిర్యాదు చేయని సంఘటనలు వందల్లో ఉంటాయి. -
తెలంగాణలో పెరిగిన పుష్కర రద్దీ
-
పుష్కరఘాట్లకు పోటెత్తిన భక్తులు
రాజమండ్రి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రెండవ రోజు బుధవారం ఆ నదీ తీరంలోని పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. పుష్కరాలు ప్రారంభమైన మొదటిరోజు మంగళవారం రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 35 మంది మరణించారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రంలో పుష్కరఘాట్‌లో స్నానమాచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నరసాపురంలోని వశిష్టగోదావరిలో పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. -
అసంపూర్తిగా పుష్కర ఘాట్లు
అల్లవరం (అమలాపురం టౌన్): అల్లవరం మండలం వైనతేయ నదీ తీరంలోని నాలుగు గ్రామాల్లో దాదాపు రూ. కోటి వ్యయంతో చేపట్టిన నాలుగు పుష్కర ఘాట్ల పనులు నూరు శాతం పూర్తికి నోచుకోలేదు. పుష్కరాల క్రతువుకు ఇక కేవలం 24 గంటలే సమయం ఉన్నా ఇవి ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. అల్లవరం మండలంలోని గోడి, బెండమూర్లంక, బోడసకుర్రు, గోపాయిలంక గ్రామాల్లోని వైనతీయ నదీ తీరంలో ప్రభుత్వం ఆరునెలల కిందటే పుష్కర ఘాట్లను ఎంపిక చేసి నిధులు కేటాయించింది. బెండమూర్లంక, గోపాయిలంక గ్రామాల్లో ఘాట్ పనులు జరగుతున్నా మంగళవారం నుంచి మొదలయ్యే పుష్కరాకలు భక్తులు స్నామమాచరించే సౌకర్యం అక్కడ లేదు. పుష్కర ఘాట్ల మెట్లకు, గోదావరి నీరుకు పొంతన లేకుండా అవి నిర్మితమవు తున్నాయి. యువకుల శ్రమదానం ఘాట్ల వద్ద గోదావరి నీరు లేకపోవటంతో గోపాయిలంకలో యువకులే శ్రమదానం చేసి ఇసుక బస్తాలను ఘాట్‌నుంచి గోదావరి నీటి వరకూ పేర్చుతున్నారు. ఘాట్ మెట్ల నుంచి ఇసుక బస్తాలపై నడిచి వెళితేనే కాని గోదావరి స్నానమాచరించే అవకాశం లేదు. ఆదివారం సాయంత్రానికి కూడా ఈ నాలుగ ఘాట్లలో తుది మెరుగులు కాదు కదా ఇంకా మిగిలిఉన్న పనులను పూర్తి చేస్తున్నారు. బెండమూర్లంక, గోడి ఘాట్‌ల్లో పనులు మంగళవారం నాటికి పూర్తి కావటం సాధ్యం కాదని ఆయా గ్రామ ప్రజలు అంటున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం ఆదివారం రాత్రి, సోమవారం పగలు, రాత్రి ఇలా రేయింబవళ్లు పనులు యుద్ద ప్రాతిపదిన పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇకవేళ పనులు పూర్తయినా ఆ ఘాట్లు భక్తులు స్నానాలు చేసేందుకు అనువుగా మాత్రం లేవు. బోడసకుర్రులో మాత్రమే ఘాట్ సక్రమంగా ఉంది. ఒకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించటం, అధికారులు తొలినుంచీ ఈ ఘాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవటం వంటి కారణాలు ఇంతటి తీవ్ర జాప్యానికి దారితీశాయి. 20 రోజుల కిందట బెండమూర్లంక ఘాట్ పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పుష్కరాల ప్రత్యేక అధికారి ధనుంజయరెడ్డి, ఎమ్మెల్మే ఆనందరావులు సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. అయినా ఆ కాంట్రాక్టర్ తీరులో మార్పులేదు. నాణ్యతకు తిలోదకాలు అమలాపురం నియోజకవర్గం మొత్తం మీద అల్లవరం మండలంలోనే నాలుగు ఘాట్లు ఉన్నాయి. అమలాపురం రూరల్ మండలంలో ఒకటి ఉన్నా ఈ నాలుగు ఘాట్లకు ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఘాట్ల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదు. టీడీపీ ప్రభుత్వంలో మిత్రపక్షమైన బీజేపీ రాష్ట్ర నాయకులు మండలంలోని ఘాట్లలో అవినీతి, నాణ్యతాలోపాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. బెండమూర్లంకలో.. బెండమూర్లంక ఘాట్‌ను రూ. 40 లక్షలుతో నిర్మిస్తున్నా అందులో రూ. 10 లక్షల వరకూ అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం బహిరంగంగా ఆరోపించడం గమనార్హం. రూ.23 లక్షలతో నిర్మిస్తున్న గోపాయిలంక ఘాట్ వల్ల భక్తులకు ప్రయోజనం సున్నా. రూ. కోటి విలువైన నాలుగు ఘాట్ల పనులను తూతూ మంత్రంగా, మసి పూసి మారేడకాయ అన్నట్లుగా కంటి తుడుపు చర్యలుగా ముగించేస్తున్నారు. -
పుష్కర ఘాట్లకు అర కిలోమీటరు నడవాల్సిందే..
రాజమండ్రి (తూర్పు గోదావరి) : పుష్కరాల్లో గోదావరి నదీ స్నానం చేయాలనుకునే వారికి అర కిలో మీటరు నడక ప్రయాణం తప్పకపోవచ్చు. ప్రత్యేకించి రాజమండ్రిలో కనీసం అర కిలో మీటరు తప్పక నడిస్తేగానీ పుష్కర ఘాట్ వద్దకు చేరుకోలేరు. పుష్కర స్నానాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా వసతి సౌకర్యాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి.. గోదావరి పుష్కరాలకు పూర్తి కేంద్ర బిందుగా మారింది. రాష్ట్ర పరిధిలో ప్రతి రోజూ 25 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తుండగా, అందులో 12 లక్షల మంది భక్తులు ఒక్క రాజమండ్రికి రాకపోకలు సాగిస్తారని అంచనా. రద్దీ దృష్ట్యా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ల వద్దకు ఎటువంటి వాహనాలను అనుమతించకూడదని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఘాట్లకు ఆరు వందల మీటర్ల దూరంలోనే ఎలాంటి వాహనాలనైనా నిలిపివేయనున్నారు. అక్కడ నుంచి కాలి నడక ద్వారానే భక్తులు ఘాట్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అసలు నడవలేని వృద్ధుల కోసం కొన్ని వీల్ చైర్లు అందుబాటులో ఉంచుతున్నారు. పుష్కర స్నానాల కోసం దూర ప్రాంతాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సు, రైళ్లతో పాటు ప్రైవేట్ వాహనాలలో రాజమండ్రికి చేరుకున్నా వారందరినీ ఉచిత బస్సులోనే ఘాట్ల వద్దకు చేర్చేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ ప్రదేశాల నుంచి ప్రయాణీకులను పుష్కర ఘాట్ల వద్దకు చేర్చడానికి 300 ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. సీలేరు ప్రాజెక్టుతో పాటు ఎగువ రాష్ట్రాల నుంచి నీటి విడుదలకు అంగీకారం పొందడం ద్వారా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కింద ఘాట్లకు నిరంతరం నీటి సరఫరా జరిగేలా చూసే ప్రయత్నాల్లో ఉన్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయా ఘాట్లలో నీటి ఇబ్బందులు ఏర్పడితే షవర్ సిస్టం ద్వారా భక్తులు స్నానాలు చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. -
దక్కన్ ఉత్తర్
భాగ్యనగరంలో ఉత్తరాది పరిమళం గుబాళించింది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు, నగరంలోని ఇతర చెరువులు పుష్కరఘాట్లను తలపించాయి. ఉత్తర భారతీయులు భక్తి శ్రద్ధలతో చేసుకునే ఛఠ్ పూజ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఏటా కార్తీక శుద్ధ షష్టి రోజు జరిగే ఈ వేడుకులో నగరంలో స్థిరపడిన ఉత్తరాదివాసులు ఉత్సాహంగా పాల్గొంటారు. సూర్యాస్తమయ సమయంలో ప్రత్యక్ష నారాయణుడికి ప్రత్యేక పూజలు చేసి మహిళలు ఉపవాస దీక్ష చేపడతారు. ఈ రోజు సూర్యోదయం తర్వాత ఆదిత్యుడికి మళ్లీ పూజలు చేసి దీక్షను విరమిస్తారు. -
'పుష్కరాలకు 11 వందల కోట్లు ఖర్చవుతుంది'
రాజమండ్రి: వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. వారంలోగా తేదీలు ఖరారు చేస్తామన్నారు. పుష్కరాలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం రాజమండ్రిలో సమావేశమైంది. పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ నిర్మించాలని అనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం రూ. 11 వందల కోట్లు ఖర్చఅవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. గతంలో జరిగిన గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు ఖర్చు అయిందని గుర్తు చేశారు. పెద్ద దేవాలయాలు, ఆదాయం వచ్చే దేవాలయాల నిధులను కూడా సమీకరించి ఈ పుష్కరాల కోసం ఖర్చు చేస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. ఈ సమవేశానికి మంత్రులు చిన్నరాజప్ప, నారాయణ తదితరులు హాజరయ్యారు.