రాజమండ్రి : గోదావరి స్నాన ఘట్టాల వద్ద చోరుల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా సెల్‌ఫోన్లు క్షణాల్లో మాయమవుతున్నాయి. యాత్రికులు పుష్కర స్నానం చేసేందుకు వస్త్రాలను మెట్లపై వదిలి తమ వారిని కాపలా ఉంచినా.. రద్దీలో చోరులు అదును చూసి సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారు. వీఐపీ ఘాట్‌లో ఈ పది రోజుల్లో సుమా రు 45 మంది యాత్రికులు సెల్‌ఫోన్లు పోట్టుకున్నారు.
ఇదే సమస్య గోదావరి తీరాన ఉన్న ప్రతి ఘాట్‌లోనూ ఉంది. బుధవారం రాజమండ్రిలోని ఒక నెట్‌వర్క్ కార్యాలయానికి సుమారు 50 మంది యాత్రికులు చేరుకుని తమ సెల్‌ఫోన్లు పోయాయని, సిమ్‌లను రిప్లేస్ చేయాలని దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.