Cell phone thieves
-
దారి తప్పిన బాల్యమిత్రులు
సాక్షి, సిటీబ్యూరో : జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం నేరాలబాట పట్టిన బాల్యమిత్రులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.అసిఫ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఒమర్ ఫరూక్, మెహదీపట్నం మురద్‌నగర్‌కు చెందిన యాసీర్ ఆలీఖాన్ చిన్ననాటి నుంచి మిత్రులు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వీరు గంజాయి, తదితర చెడు అలవాట్లకు బానిసలై వచ్చిన ఆదాయం చాలకపోవడంతో నేరాలబాట పట్టారు. ఈజీమనీ కోసం సెల్‌ఫోన్ దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఉదయం వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవారు. నేరం చేయాలనుకునే ప్రాంతంలో ముందుగానే షార్ట్‌కట్ మార్గాలు, ఏ మార్గంలో వెళితే తప్పించుకోవచ్చనే విషయాలపై రెక్కీ నిర్వహిస్తారు. బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్ లాక్కుని మాయమయ్యేవారు. ఇదే తరహాలో సైఫాబాద్ ఠాణా పరిధిలోని లకిడీకాపూల్‌లోని నిజామ్ క్లబ్ అవుట్ గేట్ వద్ద ఈ నెల 22న ఉదయం సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ వెళుతున్న వ్యక్తి నుంచి ఫోన్ లాక్కుని పరారయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులు ఒమర్ ఫరూక్, యాసీర్ ఆలీఖాన్లుగా గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ కోసం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. -
ఆదమరిస్తే ఆండ్రాయిడ్ మాయం
భామిని : ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో హుందాగా కనిపించే ఆండ్రాయిడ్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. కొత్తూరు కేంద్రంగా బస్సులు ఎక్కి దిగే ప్రయాణికుల నుంచి ఈ ఫోన్లు చోరీ జరుగుతున్నాయి. భామిని మండలంలో సింగిడికి చెందిన ముగ్గురి ఆండ్రాయిడ్ ఫోన్లు ఒకేసారి చోరీకి గురయ్యాయి. బస్సు ఎక్కే సమయంలోనే జేబుల్లోని సెల్ ఫోన్లను తష్కరిస్తున్నారు. కొత్తూరులో శ్రీకాకుళం బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల రద్దీని చోరులు సొమ్ము చేసుకుంటూ చేతివాటం చూపుతున్నట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం ఇదే విధంగా కొత్తూరులో నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లు దొంగతనం జరిగాయి. ఈ సంఘటనలపై కొత్తూరు పోలీస్‌లకు సమాచారం అందివ్వడంతో బస్సుల్లోని ప్రయాణికులను గురువారం వారు తనిఖీ నిర్వహించారు. కానీ ఫలితం లభించలేదు. ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నప్పుడు చోరులు బస్సు దిగుతున్నట్టుగానే జేబుల్లోని సెల్ఫోన్లు తçస్కరిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గత కొన్నాళ్లగా జరుగుతున్న ఈ చోరీలపై పోలీసుల మెతకవైఖరితోనే మరిన్ని దొంగతనాలు పెరుగుతున్నట్టు ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సెల్ ఫోన్ దొంగలు అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి : ఆర్టీసీ బస్టాండులో ఆదమరిచి నిద్రపోతున్న ప్రయాణికుడి జోబు నుంచి సెల్‌ఫోన్‌ను దొంగలించిన ఓ కిలాడి జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీసీ బస్టాండులో చోటుచేసుకుంది. ఐతే ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బండారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాదితుడు ఆర్టీసీ బస్టాండులో నిద్రలోకి జరుకోగానే దొంగలు చీకట్లో తాము ఏమి చేసినా గమనించలేరని సెల్‌ఫోన్‌ను దొంగలించి ఉడాయించారు. బాధితుడి నిద్రలేచే సరికి సెల్‌ఫోన్ లేకపోడంతో పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ కిలాడి దొంగలను సీసీ కెమెరాల సాయంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. -
రైల్వే ప్రయాణికులను కర్రతో కొట్టి..
నల్లగొండ క్రైం : జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నారు.. సెల్ఫోన్లు చోరీలు చేయడం మొదలు పెట్టారు. అందుకు రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఎవరైన ప్రయాణికులు నడుస్తున్న రైలు ఎక్కుతూ సెల్‌ఫోన్ మాట్లాడుతుంటే వారి చేతిని కర్రతో కొట్టి.. ఫోన్ కిందపడగానే లాక్కెళ్తున్నారు. ఇలా రెండేళ్లుగా చోరీ చేస్తున్నారు. శుక్రవారం భువనగిరి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతూ చోరీ చేస్తున్న ఇద్దరి యువకులతో పాటు వాటిని కొనుగోలు చేస్తున్న మరో నలుగురిని నల్లగొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,80,000 విలువైన 24 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ అచ్యుత్‌తో కలిసి నల్లగొండ రైల్వేస్టేషన్లో వివరాలు వెల్లడించారు. భువనగిరి పట్టణంలోని తాతానగర్‌కు చెందిన విద్యార్థి ముదరకోల శ్రీధర్, ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న కామసాని శేఖర్లు రైలు ప్రయాణికుల నుంచి చాకచక్యంగా సెల్ఫోన్లు కొట్టేస్తూ తాతానగర్‌కు చెందిన భానుప్రకాశ్, తిమ్మపూర్‌కు చెం ది న దాసరపు గణేశ్, జహంగీర్, దాసరి రవీందర్‌ల కు విక్రయిస్తున్నారు. ప్రయా ణికుల ఫిర్యాదు మే రకు రైల్వే పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. చోరీ చేసేది ఇలా.. రైలు నిదానంగా వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సెల్‌ఫోన్ మాట్లాడడం, వాట్సప్, ఫేస్బుక్ చూస్తున్నప్పుడు శ్రీధర్, శేఖర్లు కర్రతో చేతిపై కొడతారు. ఫోన్ కిందపడగానే తీసుకుపోయి ఇతరులకు విక్రయిస్తుంటారు. -
‘సెల్’ రేగిపోతున్నారు
రాజమండ్రి : గోదావరి స్నాన ఘట్టాల వద్ద చోరుల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా సెల్ఫోన్లు క్షణాల్లో మాయమవుతున్నాయి. యాత్రికులు పుష్కర స్నానం చేసేందుకు వస్త్రాలను మెట్లపై వదిలి తమ వారిని కాపలా ఉంచినా.. రద్దీలో చోరులు అదును చూసి సెల్ఫోన్లు కొట్టేస్తున్నారు. వీఐపీ ఘాట్‌లో ఈ పది రోజుల్లో సుమా రు 45 మంది యాత్రికులు సెల్ఫోన్లు పోట్టుకున్నారు. ఇదే సమస్య గోదావరి తీరాన ఉన్న ప్రతి ఘాట్లోనూ ఉంది. బుధవారం రాజమండ్రిలోని ఒక నెట్వర్క్ కార్యాలయానికి సుమారు 50 మంది యాత్రికులు చేరుకుని తమ సెల్ఫోన్లు పోయాయని, సిమ్‌లను రిప్లేస్ చేయాలని దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.