కొత్తూరు–శ్రీకాకుళం బస్సులో తనిఖీ నిర్వహిస్తున్న పోలీస్‌లు
భామిని : ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో హుందాగా కనిపించే ఆండ్రాయిడ్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. కొత్తూరు కేంద్రంగా బస్సులు ఎక్కి దిగే ప్రయాణికుల నుంచి ఈ ఫోన్లు చోరీ జరుగుతున్నాయి. భామిని మండలంలో సింగిడికి చెందిన ముగ్గురి ఆండ్రాయిడ్ ఫోన్లు ఒకేసారి చోరీకి గురయ్యాయి. బస్సు ఎక్కే సమయంలోనే జేబుల్లోని సెల్ ఫోన్లను తష్కరిస్తున్నారు. కొత్తూరులో శ్రీకాకుళం బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల రద్దీని చోరులు సొమ్ము చేసుకుంటూ చేతివాటం చూపుతున్నట్టు తెలిసింది.
రెండు రోజుల క్రితం ఇదే విధంగా కొత్తూరులో నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లు దొంగతనం జరిగాయి. ఈ సంఘటనలపై కొత్తూరు పోలీస్‌లకు సమాచారం అందివ్వడంతో బస్సుల్లోని ప్రయాణికులను గురువారం వారు తనిఖీ నిర్వహించారు. కానీ ఫలితం లభించలేదు. ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నప్పుడు చోరులు బస్సు దిగుతున్నట్టుగానే జేబుల్లోని సెల్‌ఫోన్లు తçస్కరిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గత కొన్నాళ్లగా జరుగుతున్న ఈ చోరీలపై పోలీసుల మెతకవైఖరితోనే మరిన్ని దొంగతనాలు పెరుగుతున్నట్టు ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment