సాక్షి, తూర్పుగోదావరి : ఆర్టీసీ బస్టాండులో ఆదమరిచి నిద్రపోతున్న ప్రయాణికుడి జోబు నుంచి సెల్‌ఫోన్‌ను దొంగలించిన ఓ కిలాడి జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీసీ బస్టాండులో చోటుచేసుకుంది. ఐతే ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బండారం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. బాదితుడు ఆర్టీసీ బస్టాండులో నిద్రలోకి జరుకోగానే దొంగలు చీకట్లో తాము ఏమి చేసినా గమనించలేరని సెల్‌ఫోన్‌ను దొంగలించి ఉడాయించారు. బాధితుడి నిద్రలేచే సరికి సెల్‌ఫోన్ లేకపోడంతో పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ కిలాడి దొంగలను సీసీ కెమెరాల సాయంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment