రాజమండ్రి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రెండవ రోజు బుధవారం ఆ నదీ తీరంలోని పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. పుష్కరాలు ప్రారంభమైన మొదటిరోజు మంగళవారం రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 35 మంది మరణించారు.
దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రంలో పుష్కరఘాట్లో స్నానమాచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నరసాపురంలోని వశిష్టగోదావరిలో పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు.