తిరుమలలో పెరిగిన రద్దీ | devotees heavy rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన రద్దీ

Published Sat, Jul 16 2016 8:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

devotees heavy rush in tirumala

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కోనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అయితే నేడు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్తానోత్సవం.

ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. శుక్రవారం శ్రీవెంకటేశ్వర స్వామిని 67,087 మంది భక్తులు దర్శించుకున్నారని... 3.03 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారు పుష్పాల పల్లకిలో ఊరేగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement