మూలా నక్షత్రం కావటంతో బాసరలో శనివారం వేకువజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు క్యూ కట్టారు.
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ మాత సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. అమ్మ వారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావటంతో శనివారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు క్యూకట్టారు. వందలాది మంది చిన్నారులకు అర్చకులు అక్షరాభ్యాసం చేయించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళరాత్రి అవతారంలో దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకున్నారు.