దుర్గాఘాట్‌లో సీఎం పుష్కర స్నానం | CM Pushkara bath in durgaghat | Sakshi
Sakshi News home page

దుర్గాఘాట్‌లో సీఎం పుష్కర స్నానం

Published Wed, Aug 10 2016 3:16 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

కృష్ణా పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో...

శుక్రవారం ఉదయం 5.45 గంటలకు స్నానం
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు  పుష్కర స్నానమాచరిస్తారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు.  బృహస్పతి కన్యారాశిలో గురువారం రాత్రి 9.28 గంటలకు ప్రవేశిస్తాడని.. అయితే సూర్యాస్తమయం తర్వాత పుష్కర స్నానం చేయకూడదనే నియమం ఉండడంతో 12వ తేదీ సూర్యోదయ సమయంలో పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానాలు ప్రారంభిస్తారని, అదే సమయంలో సీఎం  స్నానం చేస్తారని వెల్లడించారు. 1,120 ప్రాంతాల్లో మొత్తం 62 వేల మంది ఉద్యోగులు పుష్కరాల సేవలందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలకోసం విజయవాడలో ఏడు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement