సీఎం చంద్రబాబుకు శివాని ఆహ్వానం | Archery Kid Dali Shivani invite cm chandrababu her show | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబుకు శివాని ఆహ్వానం

Published Fri, Sep 8 2017 11:11 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

సీఎంతో డాలీ శివాని - Sakshi

సీఎంతో డాలీ శివాని

విజయవాడ స్పోర్ట్స్‌ :  విలువిద్యలో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డు, వరల్డ్‌ రికార్డు నెలకొల్పేందుకు ఈ నెల 10వ తేదీ చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో తాను నిర్వహించే ప్రదర్శనకు ఆర్చరీ కిడ్‌ డాలీ శివాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించింది. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో తన తల్లిదండ్రులతో కలసి సీఎం చంద్రబాబును కలిసింది. డాలీ శివాని ప్రదర్శించబోయే ఈవెంట్లను తండ్రి చెరుకూరి సత్యనారాయణ సీఎంకు వివరించారు.

ఆసక్తిగా విన్న చంద్రబాబు సమయాన్ని బట్టి తాను కూడా కార్యక్రమానికి వచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాలీ శివానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి రికార్డులు సృష్టించాలని ఆశీర్వదించారు. శివానికి అవసరమైన సహకారం అందజేయమని సీఎం అదనపు కార్యదర్శి రాజమౌళికి సూచిం చారు. సీఎంను కలసినవారిలో శివాని తండ్రి చెరుకూరి సత్యనారాయణ, తల్లి కృష్ణకుమారి, ఆర్చరీ అసోసియేషన్‌ ప్రతినిధి జి.ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement