సాక్షి, ప్రకాశం : ఒంగోలు-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి ఒంగోలుకు వెళ్తున్న ఓ లారీ అద్దంకి మండలం వెంకటాపురం గ్రామం వద్ద రోడ్డు పక్కన గల ఆంజనేయస్వామి ఆలయాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాన్ని బిహార్‌కు చెందినదిగా గుర్తించారు. మృతదేహాలు లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు సాయంతో బయటకు తీశారు. నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అద్దంకి సీఐ హైమారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment