నగరంలోని హైదరగూడలోని ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది.
నగరంలోని హైదరగూడలోని ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పరిశీలించిన పోలీసులు వెండి, పంచలోహాలతో తయారు చేసిన శ్రీరాముడు, సీత, ఆంజనేయ స్వామి విగ్రహాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.