15 ఏళ్లకు గుడి నిర్మాణం పూర్తి చేసిన అర్జున్‌ | Hero Arjun Hanuman Temple Inaugurating With Maha Kumbhabhishekham At Chennai | Sakshi
Sakshi News home page

హనుమంతుడి గుడి కట్టించిన యాక్షన్‌ హీరో

Published Tue, Jun 29 2021 10:06 AM | Last Updated on Tue, Jun 29 2021 11:52 AM

Hero Arjun Hanuman Temple Inaugurating With Maha Kumbhabhishekham At Chennai - Sakshi

సాక్షి, చెన్నై: యాక్షన్‌ హీరో అర్జున్‌ సర్జా తమిళనాడులోని చెన్నైలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించాడు. 15 ఏళ్ల క్రితం తలపెట్టిన గుడి నిర్మాణం ఇప్పుడు పూర్తయిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వీడియో రిలీజ్‌ చేశాడు. "నేను 15 ఏళ్లుగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి గుడి నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా జూలై 1, 2 తారీఖుల్లో కుంభాభిషేకం జరుపుతున్నాం"

"నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు అందరినీ పిలిచి ఈ వేడుకను చాలా గ్రాండ్‌గా చేద్దామనుకున్నా. కానీ కరోనా పరిస్థితుల వల్ల ఎవరికీ ఆహ్వానం పంపలేకపోతున్నా. అయినప్పటికీ ఈ వేడుకను ఎవరూ మిస్‌ కావద్దన్న ఉద్దేశ్యంతో దీన్ని లైవ్‌ స్ట్రీమ్‌ చేస్తున్నాం" అని చెప్పుకొచ్చాడు. కాగా అర్జున్‌ ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌లా నటిస్తున్నట్లు సమాచారం.

చదవండి: Sarkaru Vaari Paata: మహేశ్‌ని ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement