Na Rakumarudu
-
గ్లామరస్‌గా కనిపించడానికి రెడీ!
‘‘బాగా యాక్ట్ చేసే ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శమే. వాళ్లని ఆదర్శంగా తీసుకుని, నాదైన శైలిలో నేను పాత్రలను పండించడానికి కృషి చేస్తాను’’ అన్నారు రీతూవర్మ. ఇటీవల విడుదలైన ‘నా రాకుమారుడు’లో మెరిసిన అసలు సిసలైన తెలుగమ్మాయి తను. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి రీతూ చెబుతూ-‘‘నటిగా నాకు సంతృప్తినిచ్చే, ప్రేక్షకుల మన్ననలు పొందే పాత్రలు చేయాలనుకుంటున్నాను. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామరస్‌గా కనిపించడానికి రెడీ. అలాగే కేరక్టర్‌కి అనుగుణంగా హోమ్లీగా కనిపించడానికి సిద్ధమే. యాక్టింగ్ సులువు కాదు. మనది కాని పాత్రను చేస్తున్నప్పుడు అందులోకి పరకాయ ప్రవేశం చేయాలంటే ఏకాగ్రత కావాలి. అందుకే కెమెరా ముందున్నప్పుడు నేను రీతూ అనే విషయం మర్చిపోయి, పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకుంటాను’’ అన్నారు. త్వరలో కొత్త సినిమాలు సైన్ చేయబోతున్నానని తెలిపారు రీతూ. -
సాక్షిలో రాకుమారుడు
-
రాకుమారుడిలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి!
‘‘నాకు చదువు అంటే పెద్ద ఆసక్తి లేదు. అయితే అల్లరి మాత్రం చాలా బాగా చేస్తాను. నాకు రాకుమారుడులాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని ఉంది. అయ్యో... ఇదంతా నా పర్సనల్ అనుకునేరు. ‘నా రాకుమారుడు’ సినిమాలో నేను పోషించిన బిందు పాత్ర తీరు తెన్నులివి’’ అని నవ్వుతూ చెప్పారు రీతూవర్మ. నవీన్‌చంద్ర, రీతూవర్మ జంటగా సత్య దర్శకత్వంలో హరివిల్లు క్రియేషన్స్ పతాకంపై వజ్రంగ్ నిర్మించిన ‘నా రాకుమారుడు’ రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీతూవర్మ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘నేను పుట్టింది నార్త్‌లో. పెరిగింది... చదివింది హైదరాబాద్‌లో. ‘అనుకోకుండా’ అనే లఘు చిత్రంలో తొలుత నటించాను. ఆ తర్వాత ‘బాద్షా’లో కాజల్ అగర్వాల్ చెల్లెలుగా యాక్ట్ చేశాను. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో నా పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ‘నా రాకుమారుడు’ నాకు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. అందుకే విడుదలయ్యే వరకూ కొత్త సినిమాలు కమిట్ కావడం లేదు. దర్శకుడు సత్య నా పాత్రను బాగా డిజైన్ చేశాడు’’ అని చెప్పారు. -
నా రాకుమారుడు వస్తున్నాడు
అబ్బాయిలకు డ్రీమ్గాళ్స్ ఉన్నట్టుగానే, అమ్మాయిలకు డ్రీమ్బాయ్స్ ఉంటారు. అలాంటి ఓ డ్రీమ్‌బాయ్ కథే ‘నా రాకుమారుడు’. ఇందులో ‘అందాల రాక్షసి’ఫేం నవీన్‌చంద్ర హీరో. రీతువర్మ కథానాయిక. పూరి జగన్నాథ్ శిష్యుడు సత్య దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత వజ్రంగ్ మాట్లాడుతూ -‘‘ఇదొక భిన్నమైన కథ. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు ఓ పెయింటింగ్‌లా సినిమాను మలిచాడు. నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: కుమారస్వామి, కూర్పు: ప్రవీణ్‌పూడి, కళ: ఉపేంద్రరెడ్డి. -
రాకుమారుడి గీతాలాపన
అందాల రాక్షసి, దళం చిత్రాల ఫేం నవీన్‌చంద్ర హీరోగా హరివిల్లు క్రియేషన్స్ పతాకంపై వజ్రంగ్ నిర్మిస్తున్న చిత్రం ‘నా రాకుమారుడు’. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అచ్చు పాటలు స్వరపరిచారు. ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న సందీప్, తనీష్, ప్రిన్స్, రాహుల్ సీడీని ఆవిష్కరించి జీవితారాజశేఖర్కి ఇచ్చారు. ట్రైలర్స్ చూసి సినిమా అంచనా వేయొచ్చని, ఈ పాటలు, ట్రైలర్స్ బాగున్నాయని ‘దిల్’ రాజు అన్నారు. ‘అందాల రాక్షసి’లో నవీన్ అద్భుతంగా నటించాడని, అచ్చు మంచి పాటలు ఇచ్చాడనే నమ్మకం ఉందని, ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని బెల్లంకొండ సురేష్ చెప్పారు. నవీన్ మాట్లాడుతూ - ‘‘నా గత రెండు చిత్రాల్లోని పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఇందులో చేశాను. పాత్రకు తగ్గట్టుగా శారీరక భాషను మార్చుకున్నా’’ అన్నారు. ‘‘దర్శకుడు సత్య స్వేచ్ఛ ఇవ్వడం వల్ల చక్కని పాటలివ్వగలిగాను’’ అని అచ్చు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని దర్శక, నిర్మాతలు అన్నారు. ఇంకా రాజశేఖర్, జీవిత, వీఎన్ ఆదిత్య, ఆదిత్య తదితరులు యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు.