రాకుమారుడి గీతాలాపన
రాకుమారుడి గీతాలాపన
Published Mon, Oct 21 2013 12:58 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
అందాల రాక్షసి, దళం చిత్రాల ఫేం నవీన్‌చంద్ర హీరోగా హరివిల్లు క్రియేషన్స్ పతాకంపై వజ్రంగ్ నిర్మిస్తున్న చిత్రం ‘నా రాకుమారుడు’. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అచ్చు పాటలు స్వరపరిచారు. ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న సందీప్, తనీష్, ప్రిన్స్, రాహుల్ సీడీని ఆవిష్కరించి జీవితారాజశేఖర్‌కి ఇచ్చారు. ట్రైలర్స్ చూసి సినిమా అంచనా వేయొచ్చని, ఈ పాటలు, ట్రైలర్స్ బాగున్నాయని ‘దిల్’ రాజు అన్నారు.
‘అందాల రాక్షసి’లో నవీన్ అద్భుతంగా నటించాడని, అచ్చు మంచి పాటలు ఇచ్చాడనే నమ్మకం ఉందని, ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని బెల్లంకొండ సురేష్ చెప్పారు. నవీన్ మాట్లాడుతూ - ‘‘నా గత రెండు చిత్రాల్లోని పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఇందులో చేశాను. పాత్రకు తగ్గట్టుగా శారీరక భాషను మార్చుకున్నా’’ అన్నారు.
‘‘దర్శకుడు సత్య స్వేచ్ఛ ఇవ్వడం వల్ల చక్కని పాటలివ్వగలిగాను’’ అని అచ్చు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని దర్శక, నిర్మాతలు అన్నారు. ఇంకా రాజశేఖర్, జీవిత, వీఎన్ ఆదిత్య, ఆదిత్య తదితరులు యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు.
Advertisement
Advertisement