
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie). ఈ చిత్రానికి పొలిమేర సిరీస్ చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్‌సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.
ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయిని 28 డిగ్రీల సెల్సియస్‌లోనే కాపాడుకునే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ట్రైలర్‌లో సీన్స్ చూస్తే ఓ ఇంటి చుట్టే ఈ కథ తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment