నా రాకుమారుడు వస్తున్నాడు
నా రాకుమారుడు వస్తున్నాడు
Published Wed, Nov 20 2013 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
అబ్బాయిలకు డ్రీమ్‌గాళ్స్ ఉన్నట్టుగానే, అమ్మాయిలకు డ్రీమ్‌బాయ్స్ ఉంటారు. అలాంటి ఓ డ్రీమ్‌బాయ్ కథే ‘నా రాకుమారుడు’. ఇందులో ‘అందాల రాక్షసి’ఫేం నవీన్‌చంద్ర హీరో. రీతువర్మ కథానాయిక. పూరి జగన్నాథ్ శిష్యుడు సత్య దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత వజ్రంగ్ మాట్లాడుతూ -‘‘ఇదొక భిన్నమైన కథ. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు ఓ పెయింటింగ్‌లా సినిమాను మలిచాడు. నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: కుమారస్వామి, కూర్పు: ప్రవీణ్‌పూడి, కళ: ఉపేంద్రరెడ్డి.
Advertisement
Advertisement