నా బ్యూటీ సీక్రెట్‌ అదే! | Samantha's beauty secret | Sakshi
Sakshi News home page

నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

Published Sat, Mar 11 2017 10:57 PM | Last Updated on Sun, Jul 14 2019 4:41 PM

నా బ్యూటీ సీక్రెట్‌ అదే! - Sakshi

నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

సమంత చాలా క్యూట్‌గా ఉంటారు. ఆమె వాడే మేకప్‌ ఏ బ్రాండో? ఈ బ్యూటీ బాధలో ఉన్నప్పుడు దాన్నుంచి ఎలా బయటపడతారు? మామగారు నాగార్జున గురించి ఈ కాబోయే కోడలి అభిప్రాయం ఏంటి?.. వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇవే కాదు.. ఇంకా బోల్డన్ని ప్రశ్నలకు సమంత ఏం సమాధానాలిచ్చారో తెలుసుకుందాం..



కథానాయికగా ఇంత మంచి స్థాయికి చేరుకుంటానని ఊహించారా?
లేదు.. కానీ లక్ష్యంగా పెట్టుకున్నాను.

ఛాన్స్‌ వస్తే భవిష్యత్తులోకి వెళతారా లేక గతంలోకి వెళతారా?
ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను.

 ఏ పదం ఎక్కవసార్లు యూజ్‌ చేస్తుంటారు?
బేబీ.

నాగచైతన్య, మీరు మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారు?
మాకూ నటించాలని ఉంది. తప్పకుండా నటిస్తాం. బహుశా వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చు.

మీరు బాగా భయపడే విషయం?
ఫెయిల్యూర్‌ అంటే చాలా భయం.

కామెడీ ఫిల్మ్‌ చేస్తారా? హారర్‌ ఫిల్మ్‌చేస్తారా...?
ఛాన్స్‌ వస్తే రెండూ చేస్తాను.

ప్రెజెంట్‌ మీరు ఏ మేకప్‌ బ్రాండ్‌ వాడుతున్నారు?
మార్క్‌ జాకబ్స్‌.

శునకాల్లో మీకు నచ్చే విషయం?
కారణం లేకుండా అవి అందిరినీ ఇష్టపడతాయి.

బాధను అధిగమించడానికి ఏం చేస్తారు?
ఐస్‌క్రీము, చాక్లెట్లూ లాగించేస్తాను.

కాబోయే మామగారు నాగార్జున గురించి ఒక్క మాటలో...
ఫర్‌ఫెక్షనిస్ట్‌.

పెళ్లయ్యాక ఆయన్ను ఏమని పిలుస్తారు?
ఇంకా ఏమీ అనుకోలేదు.

భూమి మీద మీకు ఇష్టమైన స్థలం?
ఇంకేముంటుంది? మా ఇల్లు.

మీ బ్యూటీ సీక్రెట్‌ ఏంటి?
క్యాలమైన్‌ లోషన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement