
తమిళ నటి కీర్తీ సురేశ్ తెలుగు, తమిళం, మలయాళం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవలే దసరా సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. అలాగే చిరంజీవి సినిమా బోళా శంకర్‌లో అతడికి చెల్లిగా నటించి మంచి నటిగా మార్కులు కొట్టేసింది. కళ్లు చెదిరే అందంతో, క్యూట్ లుక్స్‌తో మతిపోగొట్టే కీర్తీ తన అందం వెనుక దాగున్న రహస్యం గురించి పంచుకుంది.
బ్యూటీ సీక్రెట్
మానసిక, శారీరక ఉల్లాసం కోసం నేను ప్రతిరోజూ యోగా చేస్తాను. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి.. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాను. చర్మసంరక్షణలో సహజమైన పద్ధతుల్నే పాటిస్తాను. అంటే.. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్క్రబ్ చేసుకోవడం.. పచ్చి పసుపు కొమ్ము పేస్ట్‌లో కొన్ని చిక్కటి పాలు కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటాను. షూటింగ్ లేని సమయంలో మేకప్‌కి దూరంగా ఉంటాను. అని చెబుతోంది కీర్తి.
(చదవండి: వన్నె తరగని నయన తార బ్యూటీ రహస్యం ఇదే..ఆ క్రీమ్ లేకుండా..)
Comments
Please login to add a commentAdd a comment