ఇలియానా బ్యూటీ సీక్రెట్స్
సౌందర్య సంరక్షణ అనేది ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండాలి. గత కొన్నాళ్లుగా మనం వేసవిని చూస్తున్నాం. ఈ వేసవికి తగ్గట్టుగా నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. వేసవి అనగానే నాకో విషయంలో చాలా భయంగా ఉంటుంది. ఈ భయమంతా నా స్కిన్ గురించే. నాది చాలా సున్నితమైన చర్మం. కొంచెం ఎండలోకి వెళ్లినా కందిపోతుంది. అందుకే సమ్మర్‌లో సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండా బయటికెళ్లే ప్రసక్తే లేదు.
►ఈ సీజన్‌లో జుట్టు బాగా ఎండిపోయినట్టుగా అవుతుంది. అందుకనే వారంలో రెండు సార్లయినా తప్పనిసరిగా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను. ఆ తర్వాత మంచి షాంపూతో హెయిర్ వాష్ చేస్తాను,
► సమ్మర్‌లో అవుట్‌డోర్ షూటింగ్స్ ఉండకూడదని కోరుకుంటాను. చల్లని ప్రదేశంలో షూటింగ్ అంటే భలే హాయిగా ఉంటుంది.
►వేసవిలో మేకప్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. షూటింగ్స్ ఉంటే మేకప్ తప్పదు. లేనప్పుడు అస్సలు మేకప్ జోలికి వెళ్లను.
► మామూలుగా ఉదయం లేవగానే వేడి నీళ్లల్లో కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకుని తాగుతాను. ఈ సీజన్‌లో కూడా అలాగే చేస్తాను.
►కాకపోతే ఎక్కువగా ద్రవపదార్థాలే తీసుకుంటాను. కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు ఇలా రెండు గంటలకొకసారి ఏదో ఒకటి తాగుతాను.
►సమ్మర్ వస్తోందంటే చాలు ప్రత్యేకంగా కాటన్ దుస్తులు కొనుక్కుంటాను. ఈ సీజన్‌లో అవే సౌకర్యంగా ఉంటాయి.
►వేసవిలో ఉదయం 9గంటలకు ముందు, సాయంత్రం ఆరు గంటల తర్వాత స్విమ్మింగ్ చేస్తాను. సమ్మర్‌లో చల్లని నీళ్లలో ఈతకొడుతుంటే శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది.
►ఎవరికైనా నా సలహా ఒకటే అవసరం అయితేనే ఎండలో బయటకు వెళ్లండి, లేకపోతే కూలింగ్ గ్లాసెస్, టోపీ పెట్టుకుని వేళ్తే ఎండ నుంచి రక్షణగా ఉంటుంది.