'దేవదాసు'లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇలియానా.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్ హీరోయిన్‌గా కొనసాగింది.ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో మళ్లీ మెరిసింది. సౌత్ ఇండియా చిత్రాలకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పింది. ఇక్కడ ఆమెకు ఎందుకు అవకాశాలు రాలేదో కూడా ఓపెన్‌గానే చెప్పింది.
2012లో ఇలియానాకు బాలీవుడ్‌లో నటించేందుకు అవకాశం దక్కింది. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఇలియానా ఇలా చెప్పింది. 'అనురాగ్ బసు' దర్శకత్వం నుంచి 2012లో 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయానికి దక్షిణాదిలో చాలా సినిమాలతో బిజాగా ఉన్నాను. కానీ 'బర్ఫీ' కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదలుకోవాలనిపించలేదు. నా అంచనా నిజమైంది. సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ వార్తతో ఇక సౌత్ ఇండియాలో నేను సినిమాలు చేయనని అందరూ భావించారు. ఆపై నేను బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యానని కూడా అనుకున్నారు. ఈ కారణంతో దక్షిణాది నిర్మాతలతో పాటు దర్శకులు కూడా నా పట్ల ఆసక్తి చూపించలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ సినిమా అయినా సరే చాలా నిజాయితీగా నేను పనిచేశాను. కానీ నాకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈ విషయంపై ఇన్నేళ్లైనా నాకు క్లారిటీ రాలేదు. దో ఔర్ దో ప్యార్, తేరా క్యా హోగా లవ్లీ వంటి బాలీవుడ్ చిత్రాలతో ఏడాదిలో ఇలియానా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment