అందుకే పుట్టావా అంటుంటారు!
పదేళ్ల క్రితం ఎలా ఉన్నారో కాజల్ అగర్వాల్, ఇప్పుడూ అలానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే... అప్పటికన్నా ఇంకా సన్నబడి, మెరుపు తీగలా తయారయ్యారు. మరి, మీలా ఉండాలనుకునే అమ్మాయిలకు కొన్ని టిప్స్ ఏమైనా ఇస్తారా? అని కాజల్ అగర్వాల్‌ని అడిగితే - ‘‘ప్రత్యేకంగా టిప్స్ చెప్పడం తెలియదు కానీ, నేనేం చేస్తానో చెబుతాను. ఉదయాన్నే నిద్ర లేవగానే వాటర్ తాగుతాను. ఆ తర్వాత ఎగ్ వైట్స్, బిస్కెట్స్, టీ, కాఫీ.. ఇదే నా బ్రేక్‌ఫాస్ట్. లంచ్‌కు దాల్, సబ్జీ, రైస్, రోటీ తీసుకుంటాను. రాత్రి ఏడు గంటలకు లైట్‌గా డిన్నర్ చేస్తాను. రోటీ లేక కొంచెం అన్నం, పప్పు తీసుకుంటాను.
ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల లోపు ప్రతి రెండు గంటలకోసారి ఏదో ఒకటి తింటుంటాను. ఉదాహరణకు బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న రెండు గంటలకు రైఫూట్స్, ప్రొటీన్ షేక్‌లాంటివి, లంచ్ అయిన రెండు గంటలకు బిస్కెట్స్, కొబ్బరినీళ్లు, ఫ్రూట్ జూస్‌లాంటివి తీసుకుంటాను. నా కో స్టార్స్ అయితే ‘ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ కనిపిస్తావు.. తినడానికే పుట్టావా?’ అని నా మీద జోక్స్ వేస్తుంటారు. యాక్చువల్‌గా ఒకేసారి భారీగా తినే బదులు రెండో గంటలకోసారి కొంచెం కొంచెంగా తినడమే మంచిది. ఆహారంతో పాటు వ్యాయామాలు కూడా చేయాలి. నేను యోగా చేస్తాను. జిమ్ కూడా చేస్తుంటాను’’ అని చెప్పారు.