ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం | Drinking Japanese Matcha Tea Reduces Anxiety | Sakshi
Sakshi News home page

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

Published Wed, Jul 10 2019 4:38 PM | Last Updated on Wed, Jul 10 2019 4:38 PM

Drinking Japanese Matcha Tea Reduces Anxiety - Sakshi

టోక్యో : రొటీన్‌ జీవితంలో ఒత్తిడికి గురికాని వారు అరుదు. నిత్యజీవితంలో ఒత్తిడిని బ్రేక్‌ చేసి ఉత్సాహంగా పనిచేసేందుకు జపనీయులు ఇప్పుడు మచా టీని ఆశ్రయిస్తున్నారు. ఈ టీలో ఒత్తిడిని తగ్గించే పదార్ధాలతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని జర్నల్‌ ఆఫ్‌ ఫంక్షనల్‌ ఫుడ్స్‌లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మచా పౌడర్‌ను ఎలుకలపై ప్రయోగించిన మీదట వాటిలో ఒత్తిడి, కంగారు తగ్గినట్టు గుర్తించారు.

ఒత్తిడికి కారణమయ్యే డోపమైన్‌, సెరటోనిన్‌లను ఈ టీ ఉత్తేజితం చేయడం ద్వారా ప్రశాంతత చేకూరుస్తుందని పరిశోధకులు గుర్తించారు. మచాలో మానవ శరీరానికి మేలు చేకూర్చే పదార్ధాలు ఉన్నాయని తమ అథ్యయనం గుర్తించిందని అథ్యయన రచయిత, కుమమటో వర్సిటీకి చెందిన యుకి కురిచి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement