చెడు కొవ్వును కరిగించుకోవచ్చిలా... | bad fat can be decreased | Sakshi
Sakshi News home page

చెడు కొవ్వును కరిగించుకోవచ్చిలా...

Published Tue, Sep 23 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

చెడు కొవ్వును కరిగించుకోవచ్చిలా...

చెడు కొవ్వును కరిగించుకోవచ్చిలా...

స్థూలకాయం తగ్గించుకోవా లంటే మందులు మింగనక్కరలేదు, శరీరాన్ని శ్రమపెట్టే ఎక్సర్‌సైజులూ చేయనక్కరలేదు. వంటింటి దినుసులను ఉపయోగించుకుంటే చాలు.
 

వెల్లుల్లి: దీనిలో ఉండే అలిసిన్ అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్‌గా పని చేస్తుంది. ఇది ఆహారపదార్థాలకు రుచిని ఇవ్వడమే గాక కొవ్వును కరిగిస్తుంది.
 
తేనె: రోజూ పరగడుపునే పెద్దగ్లాసుడు నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల కడుపు శుభ్రపడుతుంది. ఈ మిశ్రమంలో కొవ్వును కరిగించే గుణాలు మెండుగా ఉన్నాయి.
 
టమోటా: టమోటాలో క్యాన్సర్ కారకాలను నిర్వీర్యం చేసే లక్షణం ఉంది. అలాగే కొవ్వును నిరోధించే గుణం కూడా ఉంది. వంటకాలలో టమోటాను వాడటం ఎంతో లాభదాయకం.
 
గ్రీన్ టీ: రోజూ గ్రీన్ టీ తాగడం ఎంతో మంచిది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లతోబాటు కొవ్వును కరిగించే లక్షణం కూడా మెండుగా ఉంది.
 
క్యాబేజీ: క్యాబేజీలో స్థూలకాయాన్ని నివారించే లక్షణం ఉంది. అలాగే ఓట్లు, గుడ్ల వాడకం కూడా మంచిది. ఓట్లలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను వేగవంతం చే స్తుంది. గుడ్లలో పోషకాలు బాగా ఉంటాయి. క్యాలరీలు  చాలా తక్కువ. అందుకని ఓట్లు, గుడ్లు విరివిగా వాడటం ద్వారా కూడా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement