
బ్లాక్‌టీతో బోలెడు బెనిఫిట్స్
పరిపరి శోధన
చాయ్ మన జాతీయ పానీయం. అయితే, మన దేశంలో తేనీటికి చక్కెరతో పాటు పాలు చేర్చి తాగడం విరివిగా వాడుకలో ఉన్న అలవాటు. అక్కడక్కడా లెమన్ టీ, గ్రీన్ టీ వంటివి తాగే అలవాటు ఉన్నా, మన దేశంలో అది నామమాత్రమే. పాలు చేర్చకుండా నేరుగా బ్లాక్‌టీ తాగితే బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నెదర్లాండ్స్ పరిశోధకులు.
నాలుగేళ్ల చిన్నారులకు కూడా బ్లాక్‌టీ తాగించవచ్చని వారు చెబుతున్నారు. రోజుకు ఐదు కప్పుల బ్లాక్‌టీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని, చక్కెర వ్యాధి దరిచేరే అవకాశాలు, పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పదేళ్ల పాటు తాము నిర్వహించిన పరిశోధనల్లో తేలిందని హెల్త్ కౌన్సిల్ ఆఫ్ నెదర్లాండ్స్‌కు చెందిన నిపుణులు వెల్లడిస్తున్నారు.