Health Tips In Telugu: అరిటాకులో భోజనం చేసి ఎన్నాళ్లైంది? ఏమో గుర్తు చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. బఫే భోజనాలు వచ్చిన తర్వాత పెళ్లి భోజనం అరిటాకులో వడ్డించడం దాదాపుగా మర్చిపోయారు. అయితే, అరిటాకులో భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం కచ్చితంగా ఆ అలవాటును వదులుకోరు.
►గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలను అరిటాకులో భోజనం చేయడంలోనూ పొందవచ్చు. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అరిటాకులో కూడా ఉంటాయి. వీటితోపాటు అరిటాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు అదనంగా ఉంటాయి. ఆహారం క్రిమికీటకాదులతో కలుషితమైతే వాటిని అరిటాకులోని ఈ సుగుణాలు హరించి వేస్తాయి.
►ఒకవేళ భోజనం విషపూరితమై ఉంటే అరిటాకు రంగు మారుతుందని, అందుకే రాజులు బంగారు, వెండి పళ్లేలు లేదా అరిటాకులో భోజనం చేసేవారని చెబుతారు. ప్రాచీన గ్రంథాలే కాదు అరిటాకులో భోజనం చేయడాన్ని ఆధునిక పరిశోధనలు కూడా ఆమోదిస్తున్నాయి. ఇందులోని సుగుణాలు క్యాన్సర్ నివారణిగా పని చేస్తాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఒక చైనా పరిశోధన... పార్కిన్‌సన్స్ వ్యాధిగ్రస్థులకు అరిటాకు మేలు చేస్తుందని తెలియచేసింది. అరిటాకును అలాగే తినలేరు, కాబట్టి అందులో భోజనం చేయడం మంచిదని పరిశోధకుల అభిప్రాయం.
నీటి బొట్టు నిలవదు
►అరిటాకును బాగా పరిశీలించండి. ఇది వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది. నీటి బిందువులు తామరాకు మీద జారిపోయినట్లే అరిటాకు మీద కూడా నిలవకుండా జారిపోతాయి. ఆకులోని స్వచ్ఛమైన సువాసన, ఔషధగుణాలు వేడి పదార్థాల ద్వారా ఆహారంలో కలిసిపోతాయి. రుచిని ఇనుమడింప చేస్తాయి. అరిటాకులో భోజనం చేస్తే కలిగే ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌లోని రహస్యం అదే.
పరిశుభ్రంగా తిందాం
►అరిటాకులో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... పంటల మీద పెస్టిసైడ్స్ స్వైర విహారం చేస్తున్న ఈ రోజుల్లో అరిటాకును వాడడంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని తీరాలి.
ఆకులను ఉప్పు కలిపిన నీటిలో ముంచి శుభ్రం చేయాలి. పైన చెప్పుకున్నట్లు అరిటాకు పై పొర మైనం రాసినట్లు వాటర్ ప్రూఫ్‌గా ఉంటుంది. కాబట్టి ఇతర ఆకులకు పట్టినట్లుగా క్రిమిసంహారక మందులు ఆకును అంటిపెట్టుకోలేవు. అయినప్పటికీ శుభ్రం చేయడంలో అలసత్వం వద్దు.
చదవండి: Legs Swelling Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే...
Comments
Please login to add a commentAdd a comment