బీజింగ్ : వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ర్టోక్ ముప్పులను నివారించవచ్చని తాజా అథ్యయనం స్పష్టం చేశారు. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. చైనాలో లక్ష మందిపై జరిపిన అథ్యయనంలో గ్రీన్ టీ తాగేవారు తాగని వారితో పోలిస్తే సగటున 1.26 సంవత్సరాలు అధికంగా జీవించినట్టు గుర్తించారు. గ్రీన్ టీ తాగని వారి కంటే 1.4 ఏళ్ల తర్వాత గుండె పోటు వంటి వ్యాధుల బారిన పడ్డారని సుదీర్ఘంగా సాగిన అథ్యయనంలో వెల్లడైంది.
బ్లాక్ టీ తాగిన వారిలో ఇలాంటి ప్రయోజనాలను గుర్తిచలేదని పరిశోధకులు తెలిపారు. అయితే కేవలం మంచి ఆరోగ్యం కోసం గ్రీన్ టీకి మారితే మెరుగైన ఫలితాలు రావని, ఇతర అనారోగ్య అలవాట్లను కొనసాగిస్తూ గ్రీన్ టీ ఒక్కటితోనే పరిస్థితి మారబోదని వారు పేర్కొన్నారు. నిత్యం టీ తాగడం అలవాటుగా చేసకున్నవారికి గుండె జబ్బులు, ఇతర కారణాలతో మరణించే రిస్క్ తక్కువగా ఉంటుందని అథ్యయన రచయిత డాక్టర్ జియాన్ వాంగ్ చెప్పారు. టీలో ఉండే పోలీపెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణం కలిగిఉందని అన్నారు. పండ్లు, కూరగాయల్లో కూడా లభించే పాలీపెనాల్స్ దెబ్బతిన్న కణజాలాన్ని శక్తివంతం చేయడంతో పాటు శరీరంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తూ బరువు పెరగడాన్ని నెమ్మెదింపచేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment