ఆర్మూర్ టౌన్(నిజామాబాద్ జిల్లా): వైద్యం పేరుతో భార్యకు స్టెరాయిడ్స్ అందించిన భర్త గంగసాగర్‌పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆర్మూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ గంగసాగర్ తన భార్యను వదిలించుకోవడానికి చికిత్స పేరుతో స్టెరాయిడ్స్ ఎక్కిస్తూ మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై ఆయన భార్య స్రవంతి సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేసింది.
చదవండి: వదినమ్మ కనిపించడం లేదని.. ఆఖరికి అతడే!
దీంతో కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరపాలని సఖీ టీంకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సఖీ టీం వారు క్షేత్ర స్థాయిలో విచారించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆర్మూర్ పోలీసులకు సూచించారు. కాగా రెండేళ్ల క్రితం కులం పెద్ద మనుషుల సమక్షంలో భార్య, భర్తల మధ్య సమస్య పరిష్కారం కాక పోవడంతో ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. అలాగే స్టెరాయిడ్స్ కేసులో భర్త గంగసాగర్‌పై విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment