Armor
-
భార్యను వదిలించుకోవడానికి భర్త మాస్టర్ ప్లాన్.. వైద్యం పేరుతో
ఆర్మూర్ టౌన్(నిజామాబాద్ జిల్లా): వైద్యం పేరుతో భార్యకు స్టెరాయిడ్స్ అందించిన భర్త గంగసాగర్పై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆర్మూర్‌కు చెందిన ఆర్ఎంపీ గంగసాగర్ తన భార్యను వదిలించుకోవడానికి చికిత్స పేరుతో స్టెరాయిడ్స్ ఎక్కిస్తూ మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై ఆయన భార్య స్రవంతి సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేసింది. చదవండి: వదినమ్మ కనిపించడం లేదని.. ఆఖరికి అతడే! దీంతో కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరపాలని సఖీ టీంకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సఖీ టీం వారు క్షేత్ర స్థాయిలో విచారించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆర్మూర్ పోలీసులకు సూచించారు. కాగా రెండేళ్ల క్రితం కులం పెద్ద మనుషుల సమక్షంలో భార్య, భర్తల మధ్య సమస్య పరిష్కారం కాక పోవడంతో ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. అలాగే స్టెరాయిడ్స్ కేసులో భర్త గంగసాగర్పై విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆర్మూర్‌లో రైతుల ఆందోళన.. ఉద్రిక్తం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరను కల్పించాలని కోరుతూ జాతీయ రహాదారిపై రైతులు ఆందోళనకు దిగారు. గతవారం రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులను అర్థరాత్రి పోలీసు అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల అరెస్ట్‌లకు నిరసనగా రైతులు మరోసారి జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పంటలకు మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అరెస్టయిన రైతులను విడుదల చెయకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. మరింతమంది రైతులు ధర్నా ప్రాంతానికి తరలివస్తుండడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఆర్మూర్ వద్దగల జాతీయ రహదారిపైకి ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైతుల ఉద్యమాన్ని నియంత్రించడానికి పోలీసులు విధిం చిన 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా రైతులు గ్రామాల నుంచి కార్లు, మోటార్ సైకిళ్లపై వచ్చారు. -
తిరుమల చుట్టూ రక్షణ కవచం
ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సూచనలు తిరుమల: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రమైన తిరుమలకు చైనా గోడ తరహా రక్షణ కవచం అవసరమని టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద, హింసాత్మక చర్యల నేపథ్యంలో తిరుమల ఆలయానికి టీటీడీ పరిధిలోని 10.3 చదరపు మైళ్ల విస్తీర్ణంలో మహాప్రాకారం (రక్షణ గోడ) నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ అధునాతన సాంకేతిక త, విద్యాప్రమాణాలతో టీటీడీ విద్యాలయాలను నెలకొల్పాని కోరారు. తెలంగాణలోనూ వాటిని విస్తరించి ధార్మిక, నైతికతతో కూడిన నాణ్యమెన విద్య అందించే బాధ్యతను టీటీడీ తీసుకోవాలని సూచించారు. -
‘ఆర్మూర్ లిడ్‌క్యాప్’నకు మహర్దశ
ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో పది లిడ్ క్యాప్‌లు (చర్మ పరిశ్రమలు) ఉంటే అందులో ఆర్మూర్ లిడ్ క్యాప్‌ను ఒక్కదానిని మాత్రమే అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసినట్లు సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా సంస్థ తెలంగాణ ప్రాజెక్టు డెరైక్టర్ అరవింద్ పట్వారి తెలిపారు. గురువారం పట్టణంలోని లిడ్ క్యాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లిడ్ క్యాప్ మేనేజింగ్ డెరైక్టర్ సైదతో కలిసి ఆయన మాట్లాడారు. ఆర్మూర్ ప్రాంతం రోడ్డు, రైల్వే రవాణా పరంగా కేంద్రంగా ఉండటం వల్ల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా ఎంపిక చేశామన్నారు. ఈ ఏడాది జనవరి 15న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫైనల్ అ ప్రూవల్ లభించిందన్నారు. 2016లోగా 10 కోట్ల 87 వేలతో ఆర్మూర్ లిడ్ క్యాప్‌ను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ నిధులలో రూ. 7 కోట్ల 40 లక్షల 7 వేలు కేంద్ర ప్రభుత్వం, రూ. 2 కోట్ల 60 లక్షల 80 వేలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. రెండేళ్లలోగా పరిశ్రమకు అవసమయ్యే అన్ని మౌలిక స దుపాయాలను కల్పిస్తామన్నారు. ఆర్మూర్ లిడ్ క్యాప్‌లోని 28 ఎకరాల ఒక గుంట స్థలంలో ప్రహరీ, విద్యు త్ దీపాలు, మురికి కాలువలు, కాన్ఫరెన్స్ హాల్, రా మెటీరియల్ భద్ర పరిచే గది, ఎగ్జిబిషన్ సెల్ నిర్మాణా లు చేపడతామన్నారు. 700 గజాల విస్తీర్ణంతో ప్లాటు ్లగా మార్చి 89 యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 15 వందల మందికి ఉపాధి ఈ లిడ్ క్యాప్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 89 మందిని ఎంపిక చేసి ఈ 89 యూనిట్లను నిర్వహిస్తామన్నారు. తద్వారా సుమారు 15 వందల మందికి ప్ర త్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. లెదర్‌తో బ్యాగు లు, షూ, చెప్పులు తదితర వస్తువుల తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తామన్నారు. అయితే ఈ వస్తువులకు సరఫరా చేసే రా మెటీరియల్ తయారీ కీలకమైందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే లెదర్‌ను శు భ్రం చేసే ప్రాజెక్టు అందుబాటులో ఉందన్నారు. అలాంటి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయడానికి లిడ్ క్యాప్ ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు మంజూరు చేయడానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన చెప్పారు.