గేదెలకు స్టెరాయిడ్స్:15 మంది పట్టివేత
Published Tue, Jun 6 2017 3:24 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
హైదరాబాద్: పాతబస్తీలోని పురాని హవేలీలో గేదేలకు స్టెయిరాడ్స్‌ను ఇంజెక్ట్ చేస్తున్న15 మందిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పాల ఉత్పత్తిని పెంచడానికి గేదెలకు ఈ స్టెరాయిడ్స్(ఆక్సిటోసిన్) ఇస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 15 బాటిళ్ల ఆక్సిటోసిన్ లిక్విడ్, 16 సిరంజిన్లు, శాంపిల్ పాలు, కల్తీ తేనె, కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement