మయోసైటిస్ వల్ల ఎంతో బాధను అనుభవిస్తోంది హీరోయిన్ సమంత. ఆ బాధను పంటికింద భరిస్తూ తను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొంది. ఓవైపు ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తూ వాటి కోసం ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ కష్టపడింది. ఇటీవల ఖుషి సినిమాతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జాలీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.
నా చర్మం దెబ్బతింది..
అయితే ఓసారి అభిమానులను పలకరిద్దాం అనుకుందో, ఏమో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ పెట్టింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న ప్రశ్నకు ప్రస్తుతం ఏదీ ఒకే చేయలేదని చెప్పింది. మీ చర్మం ఎందుకంత బాగుందన్న ప్రశ్నకు.. 'అలాంటిదేమీ లేదు, చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. దానివల్ల నా చర్మం దెబ్బతింది, పిగ్మంటేషన్ వచ్చింది. చిన్మయి నన్ను గ్లాసీగా చేస్తానంది' అని పేర్కొంది. యాక్షన్ సినిమా చేయొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా సిటాడెల్‌లో యాక్షన్ రోల్ చేశానంది.
ఆ మూడు అంశాలు..
నీ జీవితంతో ముడిపడి ఉన్న మూడు అంశాలు చెప్పమనగా.. '1.నేను దేన్నైనా సాధిస్తాను. 2. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని ప్రశ్నించడం మాని యథాతథంగా స్వీకరిస్తాను. 3. నీతి, నిజాయితీతో ముందుకు సాగుతా' అని రిప్లై ఇచ్చింది. టీనేజర్స్‌కు మీరిచ్చే సందేశం ఏంటి? అన్న ప్రశ్నకు 'నా జీవితం ఇక్కడితోనే అయిపోయింది అని ఎప్పుడూ ఫీలవకండి. జీవితంలో ఇంకా ఎన్నో కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగండి. నేను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటానని అసలు ఊహించలేదు. లైఫ్‌లో ఇన్ని ఇబ్బందులు పడతాననీ అనుకోలేదు. పాజిటివ్‌గా ముందుకు వెళ్లండి' అని చెప్పుకొచ్చింది సామ్.
Comments
Please login to add a commentAdd a comment