జిమ్‌లకు వెళ్లే వారికి విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ సీజ్
రూ. 2 లక్షల విలువైన 22 రకాల స్టెరాయిడ్స్ స్వాదీనం
సాక్షి, హైదరాబాద్: శారీరక సౌష్టవం, కండలు పెంచాలనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని స్టెరాయిడ్స్ అమ్ముతున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్ పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. రూ.2 లక్షల విలువైన 22 రకాల స్టెరాయిడ్స్‌ను స్వా«దీనం చేసుకుని, సంస్థను సీజ్ చేసినట్లు డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోఠిలోని ఈసామియా బజార్‌లో రాకేశ్ కనోడియా నిర్వహిస్తున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్‌లో అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయి స్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 18, 19 తేదీల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. స్వా«దీనం చేసుకున్న స్టెరాయిడ్స్‌ను పరీక్షల కోసం పంపామన్నారు.
అనుమతి లేకుండానే మందుల దుకాణం..
మియాపూర్‌లోని శ్రీకాంత్ న్యూరోసెంటర్‌లో లెసెన్స్ లేని మందుల దుకాణాన్ని సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండానే మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్నట్టు సోదాల్లో భాగంగా గుర్తించామని కమలాసన్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment