prize distribution
-
ఎవరి పతకం వారే...
టోక్యో: కరోనా కాలంలో పాత కాలం నాటి నిబంధనలుండవ్! మారతాయి లేదంటే మహమ్మారి మార్చేస్తుంది. సరిగ్గా అలాంటిదే టోక్యో ఒలింపిక్స్‌లో జరుగనుంది. పతకాల ప్రదానోత్సవ వేడుక అట్టహాసంగా, అతిరథుల చేతుల మీదుగా జరగదు. ఫీల్డులో గెలిచిన వారే పోడియంపైకి వచ్చి వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరి పతకాన్ని వారే ఓ ఆభరణంగా ధరిస్తారు అంతే! వైరస్ సంక్రమణాన్ని నిరోధించడంలో భాగంగా పతకాల తంతును అలా ముగించనున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. ఒక ప్లేట్లో పతకాలు పోడియం దగ్గరకు తీసుకొస్తారు. ఎవరేం గెలిచారో (స్వర్ణ, రజత, కాంస్యం) వాళ్లే స్వీయ పతకధారణ చేసుకోవాలి. ఇంకా వేదిక వద్దగానీ, పోటీల దగ్గర కానీ కరచాలనం, భుజం తట్టి ప్రోత్సహించడం (వెల్డన్)లాంటివి ఈ క్రీడల్లో నిషిద్ధం. కలకలం రేపుతున్న కేసులు... అంతా బాగుందిలే... ఇక వేడుకలే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో బుధవారం నాటి కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క టోక్యోలోనే 1,149 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. గత ఆరు నెలల కాలంలో ఇదే అత్యధికమని టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ కోవిడ్ కేసుల పెరుగుదల జపాన్ ప్రభుత్వాన్ని, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), గేమ్స్ నిర్వాహక కమిటీలను కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది. టోక్యోలో జనవరి 22న 1,184 మంది కోవిడ్ బారిన పడగా ఆ తర్వాత ఎప్పుడూ ఆ స్థాయికి రానేలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ ప్రొటోకాల్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని ఐఓసీ, జపాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజా వారి చేతుల మీదుగా... టోక్యో విశ్వక్రీడలను జపాన్ రాజు ప్రారంభిస్తారని గేమ్స్ నిర్వాహక కమిటీ వర్గాలు తెలిపాయి. జపాన్ చక్రవర్తి నరుహితో 23న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలు ఆరంభమయినట్లు అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. 61 ఏళ్ల రాజు నరుహితో టోక్యో ఒలింపిక్స్‌కు ప్యాట్రన్‌గా ఉన్నారు. వేడుకల్లో భాగంగా ఇంపీరియల్ ప్యాలెస్‌లో విదేశీ వీఐపీలతో భేటీ అవుతారని అక్కడి వర్గాలు తెలిపాయి. గతంలో జపాన్ ఆతిథ్యమిచ్చిన మెగా ఈవెంట్లను ఈ రాజు కుటుంబీకులే ఆరంభించారు. 1998 వింటర్ ఒలింపిక్స్‌ను ఆయన తండ్రి అకిహితో ప్రారంభించగా, 1964 సమ్మర్ ఒలింపిక్స్, 1972 వింటర్ ఒలింపిక్స్‌లను తాత... హిరోహితో రాజదర్పంతో ఆరంభించారు. చైనా జంబో సేన... బీజింగ్: విశ్వ క్రీడలకు చైనా జంబో సేన బయల్దేరనుంది. 431 మంది క్రీడాకారులతో సహా 777 మందితో కూడా చైనా బృందం టోక్యోలో అడుగుపెట్టనుంది. ఇందులో 133 మంది పురుష అథ్లెట్లు అయితే రెట్టింపునకు మించి 298 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. 14 ఏళ్ల డైవింగ్ క్రీడాకారిణి క్వాన్ హాంగ్చన్ నుంచి 52 ఏళ్ల ఈక్వెస్ట్రియన్ రైడర్ లి జెన్కియాంగ్ వరకు చైనా జట్టులో ఉన్నారు. చైనా వెలుపల జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే అతిపెద్ద చైనా బృందం ఇదే! బీజింగ్(2008)లో 639 మంది అథ్లెట్లు సహా 1099 మంది పాల్గొన్నారు. చీర్4ఇండియా... న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందాన్ని ఉత్సాహపరిచే పాటను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం విడుదల చేశాడు. ‘చీర్4ఇండియా’ పేరుతో ఈ పాట భారతీయ శ్రోతలను అలరించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఈ ప్రత్యేక పాటకు సంగీతం అందించగా... యువ గాయని అనన్య బిర్లా ఆలపించారు. అధికారిక పాట విడుదల సందర్భంగా మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ అందరూ ఈ పాటను వినాలని, తమ వారికి షేర్ చేయాలని అలా యావత్ భారత్ ఈ పాట ద్వారా తమ వాణి వినిపించాలని, భారత బృందానికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా నేపథ్యంలో భారత క్రీడాకారుల సన్నాహాలకు ఎదురైన ఇబ్బందులు, అధిగమించిన తీరు ప్రతిబింబించే విధంగా ఈ పాట ఉందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చీఫ్ నరీందర్ బాత్రా చెప్పారు. ముగ్గురు కాదు ఆరుగురితో ప్రతిజ్ఞ... ఆనవాయితీగా వేడుకల ప్రారంభోత్సవంలో ప్రతిజ్ఞ చేసే అథ్లెట్ల సంఖ్యను రెట్టింపు చేశారు. సాధారణంగా ముగ్గురితో జరిపే ఈ లాంఛనాన్ని ఈసారి ఆరుగురితో నిర్వహిస్తారు. లింగ సమానత్వంలో భాగంగా ప్రతిజ్ఞ చేసే అథ్లెట్ల సంఖ్యను పెంచినట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. అంటే ముగ్గురు చొప్పున మహిళలు, పురుషులు ప్రతిజ్ఞలో పాల్గొంటారు. -
టాలెంట్ ఒక్కరి సొత్తు కాదు: రోశయ్య
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఆదివారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పీస్ పోస్టర్ పోటీ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నవంబర్ 2న నిర్వహించన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సత్కరించారు. లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఏ చైర్మన్ సత్యవోలు రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజేతలు సాయితేజ, సంహిత రెడ్డి, సంజన బహుమతులు అందుకున్నారు. మరో 10 మంది చిన్నారులకు ప్రత్యేక బహుమతులు ప్రదానం చేశారు. 300 మందికి పోత్సాహక బహుమతులు అందజేశారు. ఉత్తమ సేవా అవార్డు, ఉత్తమ డ్రాయింగ్ టీచర్ పురస్కారాలు కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ చైర్మన్, లయన్ ఎంఆర్ఎస్ రాజు, లయన్స్‌క్లబ్ గవర్నర్ బి.ప్రభాకర్, డాక్టర్ రాజగోపాల్‌రెడ్డి, మనోజ్‌కుమార్ పురోహిత్, బండారు ప్రభాకర్, రమేశ్ చంద్ర పండిత్, ఎల్లా సుబ్బారెడ్డి, కృష్ణా రెడ్డి, వెంకట సురేశ్, డాక్టర్ పరం శివం, మహేశ్, పూజిత, మనాలి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఎరీనా స్కూల్ ఫెస్ట్ విజేతలకు బహుమతులు
-
అంతిమ విజయం ధర్మానిదే
విజయవాడ కల్చరల్ : ధర్మం ఉన్న చోట జయం ఉంటుందని ఇస్కాన్ సౌత్ ఇండియా డివిజన్ కౌన్సిల్ చైర్మన్ సత్యచగోపీనాథ్ ప్రభూజీ వివరించారు. ఇస్కాన్ సంస్థ స్వర్ణోత్సవాలు స్వరాజ్యమైదానంలో రెండురోజులుగా జరిగాయి. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన బాల బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యగోపీనాథ్ మాట్లాడుతూ భారతదేశం నిరంతరం ధర్మం కోసం పాటుపడుతున్నందునే ప్రపంచ దేశాలు మన దేశంవైపు చూస్తున్నాయని చెప్పారు. సక్రమంగా సంపాదించిన ధనమే నిలుస్తుందని, అక్రమ మార్గంలో వచ్చిన సంపాదన నిలువదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు కేటగిరీలో నిర్వహించిన పోటీల్లో 30 వేలమందికి పైగా పాల్గొన్నారని చెప్పారు. దాదాపు రూ. 20 లక్షలను ప్రైజ్ మనీగా అందిస్తున్నామన్నారు. ఇస్కాన్ విశేష సేవలు : మంత్రి ప్రత్తిపాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ సేవలు ఇతర సేవా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరారవు మాట్లాడారు. వివిధ కేటగిరిలో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. విజేతలు వీరే .. ఆరు నుంచి పదో తరగతి వరకు మెదటి బహుమతి రూ. 1 లక్ష వడలి కాకినాడకు చెందిన సుబ్రహ్మమణ్వేశ్వరశర్మ, ద్వితీయ రూ.75 వేలు అనంతపురానికి చెందిన టి.సాయిలిఖిత, తృతీయ రూ. 50 వేలు అనంతపురానికి చెందిన బి.మహేష్‌బాబు, రెండో కేటగిరీలో మొదటి బహుమతి రేణిగుంటకు చెందిన పాసల మహేష్, ద్వితీయ బహుమతి కాకినాడకు చెందిన బి. వెంకటసాయి, తృతీయ బహుమతి పి. సాయిగాయత్రి, మూడో విభాగంలో మెదటి బహుమతి విజయవాడకు చెందిన డాక్టర్ జె. ప్రసన్న, ద్వితీయ బహుమతి ఎస్. కృష్ణ ప్రసాద్, తృతీయ బహుమతి బి. శ్రీనివాసులు సాధించారు. వీరితోపాటు ప్రతి జిల్లాలోనూ గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు బరంపురానికి చెందిన ప్రిన్సి గ్రూప్ నృత్య దర్శకుడు టి. కృష్ణారెడ్డి నృత్య దర్శకత్వంలో శ్రీకృష్ణలీలలు, కాళీయ మర్దనం, శ్రీకృష్ణుని రాసలీలలు, కృష్ణడు అర్జనునికి గీతను బోధించడం అంశాలన ప్రదర్శించారు. నేటి కార్యక్రమాలు సాయంత్రం 7 గంటలకు సంకీర్తన, 7.30 సత్యగోపీనాథ్ భాగవతం అంశంగా ప్రసంగం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు -
కృష్ణా వర్సిటీ బాస్కెట్‌బాల్ విజేత పీబీ సిద్ధార్థ
నూజివీడు: కృష్ణా విశ్వవిద్యాలయం పురుషుల బాస్కెట్‌బాల్ పోటీల విజేతగా విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల జట్టు నిలిచింది. రెండురోజులుగా పట్టణంలోని విక్టోరియా టౌన్‌హాల్ బాస్కెట్‌బాల్ కోర్టులో ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహించిన పోటీల్లో ఆరు జట్లు తలపడ్డాయి.ఫైనల్లో పీబీ సిద్ధార్థ జట్టు లయోలా జట్టుపై 58–38 తేడాతో విజయం సాధించింది. మూడు, నాలుగు స్థానాల్లో నూజివీడు ఎంవీఆర్,, విజయవాడ కేబీఎ¯ŒS కళాశాలల జట్లు నిలిచాయి.విజేతలకు మునిసిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు బసవా భాస్కరరావు, పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి ఎంవీ బసవేశ్వరరావు, వర్సిటీ స్పోర్‌్ట్స బోర్డ్ కార్యదర్శి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు కోటగిరి గోపాల్, బాస్కెట్‌బాల్ కోచ్ వాకా నాగరాజు, పీఈటీలు ఎస్.లక్షి్మ, ఆలీఖాన్, బలరామ్, డీఏఆర్ కళాశాల పీడీ అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
విజేతలకు బహుమతి ప్రదానం
రాజమహేంద్రవరం కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలో సుమారు 40 పాఠశాలల్లో నిర్వహించినపరిచయ్, ప్రవేశిక ధార్మికవిజ్ఞాన పరీక్షలలో విజేతలకు బుధవారం దానవాయిపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో బహుమతులను అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించినవారికి శ్రీవారి వెండిడాలరుతో పాటు వరుసగా రూ. 1,000, రూ. 750, రూ. 500 నగదుపురస్కారాలను అందజేశారు. ముఖ్య అతిథి, జిల్లా ధర్మప్రచార మండలి అధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ బహుమతులు రానివారు నిరుత్సాహపడరాదు, విజేతలు విర్రవీగరాదని హితవు పలికారు. ఆధునికత పేరిట వెర్రి పోకడలు ప్రారంభమయ్యాయని, మన సంస్కృతి మీద దండయాత్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మపరిరక్షణకు టీటీడీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ధర్మప్రచార మండలి కో–ఆర్డినేటర్ ఎం.సత్యనారాయణ, ప్రోగ్రాం అసిస్టెంట్ ఓరుగంటి నరసింహయోగి, పురాణ పండితుడు వెంపరాల రామకృష్ణ ప్రసాద్, ధర్మప్రచార మండలి సభ్యుడు జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విజేతలు : పరిచయ్ పరీక్ష: బి. మనీషా (కొత్తలంక– ప్రథమ), ఎం. శ్రుతి (రాజమహేంద్రవరం– ద్వితీయ), జి. అమృత (కాట్రేనికోన– తృతీయ). ప్రవేశిక పరీక్ష : పి.పావని (బట్టెలంక, మలికిపురం మండలం– ప్రథమ), ఎన్‌ఎస్‌ఎల్‌వీ పావని (మురమళ్ల– ద్వితీయ), ఏఏవీ విజయలక్ష్మి (అంతర్వేది– తృతీయ) -
రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్మింటన్ అకాడమీలను ఏర్పాటు చేస్తాం
ప్రొద్దుటూరు కల్చరల్: రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్మింటన్ అకాడమీలను ఏర్పాటు చేస్తామని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని జార్జ్‌కారొనేషన్‌క్లబ్‌లోని వర్రా గురివిరెడ్డి ఇండోర్ స్టేడియంలో బుధవారం రాష ్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఒలింపిక్‌లో పి.వి.సింధు బ్యాడ్మింటన్‌లో వెండి పతకం సాధించడంతో దేశ వ్యాప్తంగా ఈ క్రీడకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్యాడ్మింటన్ అభివద్ధికి అకాడమీలను నెలకొల్పుతామన్నారు. దేశంలో బ్యాడ్మింటన్ క్రీడ అభివద్ధి చెందిందంటే అది ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఘనతే అని చెప్పారు. బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధిస్తున్న వారంతా ఆంధ్రప్రదేశ్‌లోనే నేర్చుకున్నామని చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో 6 అకాడమిలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. క్రీడల్లో తెరవెనుక కష్టపడేవారు ఎందరో ఉంటారని, తగిన మౌలిక వసతులు ఉంటే ఎందరో క్రీడాకారులను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. సింధుకు రూ.20 కోట్ల వరకు నగదు ప్రోత్సాహక బహుమతులు వచ్చాయని అదే డబ్బును బ్యాడ్మింటన్ అభివద్ధికి ఖర్చుచేస్తే 20 మంది సింధులను తయారు చేయవచ్చని వివరించారు. -
వరంగల్ నిట్‌కే ఓవరాల్ చాంపియన్‌షిప్
కాజీపేట: కాజీపేటలోని నేషనల్ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో యువ ఇంజనీర్ల సృజనాత్మకతకు అద్దంపట్టిన స్ప్రింగ్ స్ప్రీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. దేశ విదేశాలకు చెందిన 1500 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 6వేల మందికి పైగా విద్యార్థులు పలు అంశాల్లో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడురోజులపాటు 108 అంశాల్లో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. ఆతిథ్య కళాశాల వరంగల్ నిట్‌కే 80 శాతం బహుమతులు రాగా, ఓవరాల్ చాంపియన్ షిప్‌ను దక్కించుకుంది.