
కృష్ణా వర్సిటీ బాస్కెట్‌బాల్ విజేత పీబీ సిద్ధార్థ
నూజివీడు: కృష్ణా విశ్వవిద్యాలయం పురుషుల బాస్కెట్‌బాల్ పోటీల విజేతగా విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల జట్టు నిలిచింది. రెండురోజులుగా పట్టణంలోని విక్టోరియా టౌన్‌హాల్ బాస్కెట్‌బాల్ కోర్టులో ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహించిన పోటీల్లో ఆరు జట్లు తలపడ్డాయి.ఫైనల్‌లో పీబీ సిద్ధార్థ జట్టు లయోలా జట్టుపై 58–38 తేడాతో విజయం సాధించింది. మూడు, నాలుగు స్థానాల్లో నూజివీడు ఎంవీఆర్,, విజయవాడ కేబీఎ¯ŒS కళాశాలల జట్లు నిలిచాయి.విజేతలకు మునిసిపల్ చైర్‌పర్సన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు బసవా భాస్కరరావు, పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి ఎంవీ బసవేశ్వరరావు, వర్సిటీ స్పోర్‌్ట్స బోర్డ్ కార్యదర్శి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు కోటగిరి గోపాల్, బాస్కెట్‌బాల్ కోచ్ వాకా నాగరాజు, పీఈటీలు ఎస్.లక్షి్మ, ఆలీఖాన్, బలరామ్, డీఏఆర్ కళాశాల పీడీ అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు.