Basketball competitions
-
కృష్ణా వర్సిటీ బాస్కెట్‌బాల్ విజేత పీబీ సిద్ధార్థ
నూజివీడు: కృష్ణా విశ్వవిద్యాలయం పురుషుల బాస్కెట్‌బాల్ పోటీల విజేతగా విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల జట్టు నిలిచింది. రెండురోజులుగా పట్టణంలోని విక్టోరియా టౌన్‌హాల్ బాస్కెట్‌బాల్ కోర్టులో ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహించిన పోటీల్లో ఆరు జట్లు తలపడ్డాయి.ఫైనల్లో పీబీ సిద్ధార్థ జట్టు లయోలా జట్టుపై 58–38 తేడాతో విజయం సాధించింది. మూడు, నాలుగు స్థానాల్లో నూజివీడు ఎంవీఆర్,, విజయవాడ కేబీఎ¯ŒS కళాశాలల జట్లు నిలిచాయి.విజేతలకు మునిసిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు బసవా భాస్కరరావు, పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి ఎంవీ బసవేశ్వరరావు, వర్సిటీ స్పోర్‌్ట్స బోర్డ్ కార్యదర్శి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు కోటగిరి గోపాల్, బాస్కెట్‌బాల్ కోచ్ వాకా నాగరాజు, పీఈటీలు ఎస్.లక్షి్మ, ఆలీఖాన్, బలరామ్, డీఏఆర్ కళాశాల పీడీ అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
సత్తా చాటిన ‘తూర్పు’
కాకినాడస్పోర్ట్స్/పెదపూడి: అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీల్లో తూర్పుగోదావరి జట్లు విజయకేతనం ఎగరేసి సత్తా చాటాయి. అండర్ 14 బాలురు, బాలికల విభాగాల్లో, అండర్ 17 బాలుర విభాగంలో తూర్పుగోదావరి క్రీడాకారులు ప్రథమ స్థానంలో నిలిచారు. గొల్లలమామిడాడలోని డీఎల్ఆర్ లక్ష్మణరెడ్డి కళాశాల ప్రాంగణంలో 60వ అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలు సోమవారం రాత్రి అట్టహాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నెక్ సంఘం అధ్యక్షుడు పడాల సుబ్బారెడ్డి, గౌరవ అతిథిగా కాకినాడ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి డీఎల్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వీఆర్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. పోటీల రాష్ట్ర పరిశీలకుడు కృష్ణారెడ్డి, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు గోవిందరాజులు, మాజీ అధ్యక్షుడు పి.శ్రీరామచంద్రమూర్తి, పాఠశాల అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి టీవీఎస్ రంగారావు, పోటీల నిర్వహణా కమిటీ సభ్యులు అప్పారెడ్డి, పీడీలు గంగాధర్, బంగార్రాజు, రాజశేఖర్, శ్రీనివాసు, పట్టాభి,పీఈటీ అప్పారెడ్డి, శ్రీనివాసు రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శివాజి, మండ రాజారెడ్డి, చైతన్య బ్యాంకర్స్ సత్తిరెడ్డి, ప్రత్యూష మురళి, పి.రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు అండర్-14 బాలుర విభాగంలో తూర్పు, గుంటూరు, కృష్ణా జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో తూర్పుగోదావరి, అనంతపురం, పశ్చిమ గోదావరి జట్లు మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అండర్-17 బాలుర విభాగంలో తూర్పు, కృష్ణా, చిత్తూరు జట్లు, బాలికల విభాగంలో గుంటూరు, పశ్చిమ, చిత్తూరు జట్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. జాతీయ స్థాయికి ఎంపికైన బాస్కెట్‌బాల్ క్రీడాకారుల వివరాలను టోర్నమెంట్ పరిశీలకుడు కృష్ణారెడ్డి సోమవారం రాత్రి వెల్లడించారు. అండర్-14 విభాగం జాతీయ స్థాయి పోటీలు రాజస్థాన్‌లోని గూటాన్లో నవంబర్ 1 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు. అండర్-17 విభాగం పోటీలు విశాఖలో డిసెంబర్ మొదటి వారంలో జరుగుతాయని తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన జట్ల సభ్యులు అండర్-14 బాలుర విభాగం : ఎ.సాయిపవన్‌కుమార్, ఎం.డి.గౌష్, వి.ఆర్.ఆర్.మణికంఠరెడ్డి, హేమంత్, ఎస్.వి.అమీర్, సాయి కమల్కాత్, సి.హెచ్.శేఖర్, ఎస్.కె.సాయి, అరవింద్, అమృతరాజ్, ఆనంద్, సాయినిఖిల్. బాలికల విభాగం : పి.సుస్మిత, జహీరా సుల్తాన్, జాస్మిన్, ఆదమ్మ, హరిత, మంజుల, వైష్ణవి, సత్యవతి, సిందు, వి.లక్ష్మి, సంధ్య, విద్యఅనూష. అండర్-17 బాలుర విభాగం: వి.నాగదుర్గాప్రసాద్, ఎం.మణికంఠ, కె.అభినాష్, ఏవీ సుబ్రహ్మణ్యం, చాన్ బాషా, శ్రీకర్, నిఖిల్‌చౌదరి, ప్రవీణ్‌కుమార్, ఎన్.వెంకట కృష్ణారెడ్డి, టి.కృష్ణారెడ్డి, సాగర్, సి.హెచ్.వెంకటసాయి. బాలికల విభాగం: వై.యమ్మలక్ష్మి, ఉమామహేశ్వరి, చాందిని, పద్మావతి, నందిని, అమృత, తేజశ్విని, శ్వేత, డి.పూర్ణ, దివ్యభారతి, పద్మావతి. -
ముగిసిన బాస్కెట్‌బాల్ పోటీలు
పురుషుల విభాగం విజేత జేఎన్టీయూ కాకినాడ మహిళల విజేతగా ‘సెయింట్ పోయిస్’ నూజివీడు, న్యూస్‌లైన్ : నూజివీడు డీఏఆర్ కళాశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన 38వ రాష్ట్రస్థాయి బాస్కెట్ పోటీలు ముగిశాయి. పురుషుల విభాగంలో కాకినాడ జేఎన్టీయూ జట్టు, మహిళల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన సెయింట్ పోయిస్ జట్టు విజేతలుగా నిలి చాయి. సెమీస్, ఫైనల్‌తో పాటు రెండు విభాగాల్లో 3,4 స్థానాలకు ఆదివారం పోటీలు నిర్వహించారు. మహిళల, పురుషుల సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. మహిళల విభాగంలో వీటీహెచ్ నూజివీడు, జీఎస్సీ గుంటూరు జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్‌ను వీటీహెచ్ 38-23 పాయింట్ల తేడాతో గెలుచుకుని ఫైనల్‌కు చేరింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన సెయింట్ పోయిస్ జట్టు మార్టేరుకు చెందిన వైబీఏ జట్టుపై 48-22 పాయిట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వీటీహెచ్ నూజివీడు, సెయింట్ పోయిస్ హైదరాబాద్ జట్లు ఫైనల్‌కు చేరాయి. మూడు, నాల్గో స్థానాల కోసం నిర్వహించిన మ్యాచ్‌లో మార్టేరు వైబీఏ జట్టు గుంటూరు జీఎస్సీపై 32-29 తేడాతో గెలిచి మూడోస్థానంలో నిల వగా, గుంటూరు జట్టు నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో తొలి సెమీఫైనల్ మ్యచ్ జేఎన్టీయూ(కే), అనంతపురం మధ్య జరిగింది. జేఎన్టీయూ(కే) 78-56 పాయింట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్‌సెంట్రల్ రైల్వే విజయవాడ జట్టు నెల్లూరు పై 45-25 స్కోరుతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అనంతరం మూడు, నాలుగు స్థానాలకు జరిగిన పోటీలో అనంతపురం జట్టు నెల్లూరు జట్టుపై 54-39 తేడాతో గెలిచింది. దీంతో అనంతపురం మూడోస్థానం, నెల్లూరు నాల్గో స్థానంలో నిలిచాయి. హోరాహోరీగా మహిళల ఫైనల్ మ్యాచ్ మహిళ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌కు చెందిన సెయింట్ పోయిస్, నూజివీడు వీటీహెచ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగింది. మొదటి క్వార్టర్లో వీటీహెచ్ ఆధిక్యంలో ఉండగా, తొలిఅర్ధభాగం ముగిసే సరికి 27-26 తేడాతో సెయింట్ పాయిస్ స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సెయింట్ పోయిస్ జట్టుకు చెందిన పూర్ణిమ అలవోకగా బాస్కెట్లు వేసి పాయింట్లు సాధించడంతో చివరకు సెయింట్పోయిస్ జట్టు 57-46 స్కోరుతో వీటీహెచ్పై గెలిచి కప్‌ను కైవసం చేసుకుంది. మొత్తం పాయింట్లలో పూర్ణిమ ఒక్కరే 31పాయింట్లు సాధించారు. వీటీహెచ్ జట్టులో స్రవంతి 27 పాయింట్లు సాధించారు. పురుషుల ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. జేఎన్టీయూ కాకినాడ, సౌత్‌సెంట్రల్ రైల్వే విజయవాడ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 60-37స్కోరుతో జేఎన్టీయూ కాకినాడ జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. సౌత్‌సెంట్రల్ రైల్వే జట్టు రన్నర్‌గా మిగిలింది. నూజివీడుకే గర్వకారణం ఏ టోర్నీ జరగని విధంగా 38 ఏళ్లుగా రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహించడం నూజివీడుకే గర్వకారణమని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌అప్పారావు అన్నారు. రాజా వెంకటాద్రి అప్పారావు స్మారక 38వ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నూజివీడులో స్టేడియం నిర్మించాలనే తనకోరికను నెరవేర్చేందుకు కృషిచేస్తున్నానని పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకుడు కాపా శ్రీనివాసరావు క్రీడలలో ప్రావీణ్యత ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవచ్చన్నారు. డీఏఆర్ కళాశాల పాలకవర్గం సెక్రటరీ బొబ్బిలి కొండలరావు, ప్రిన్సిపాల్ జి.వి.రామారావు, పీడీ అంజాద్ అలీ, టీడీపీ పట్టణాధ్యక్షుడు నూతక్కి వేణు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లకు కప్, షీల్డులను అందజేశారు. సీనియర్ క్రీడాకారులకు సన్మానం బాస్కెట్‌బాల్ క్రీడలను నూజివీడులో ప్రారంభించిన సమయంలో నూజివీడు జట్టుకు ఆడి అనేక కప్‌లు సాధించిన వెటర్నర్ క్రీడాకారులు పలగాని పిచ్చయ్య, జి.ఇందిర, బాలాజీసింగ్‌ను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకటప్రతాప్‌అప్పారావు, పార్టీ నాయకుడు లాకా వెంగళరావుయాదవ్, టీడీపీ నాయకులు కాపా శ్రీనివాసరావు, నూతక్కి వేణు ఘనంగా సన్మానించారు. -
క్రీడాకారులను ప్రోత్సహించాలి : డీఎస్పీ
నూజివీడు, న్యూస్‌లైన్ : విద్యార్థి దశనుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని నూజివీడు డీఎస్పీ ఆరుమళ్ళ శంకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక ధర్మఅప్పారావు కళాశాల ఆవరణంలో శ్రీరాజా వెంకటాద్రి అప్పారావు బహద్దూర్ 38వ స్మారక రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. పోటీల్లో 11 జిల్లాలనుంచి 32 జట్లు పాల్గొన్నాయి. డీఎస్పీ మాట్లాడుతూ మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థి దశలోనే తర్ఫీదునిచ్చినపుడు గ్రామస్థాయి నుంచీ మేటి క్రీడాకారులు తయారవుతారన్నారు. నేడు తల్లిదండ్రులు చదువుకు ఇచ్చినంత ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పుతేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ పరంగా క్రీడల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అవసరమని చెప్పారు. బాస్కెట్ పోటీలకు పుట్టినిల్లు అయిన నూజివీడులో 38ఏళ్లుగా టోర్నమెంటు నిర్వహించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వం క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలను విజయవంతం చేయడంలో స్థానికుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ పోటీల గురించి విస్తృతమైన ప్రచారం ఎంతో అవసరమని తెలిపారు. డీఏఆర్ కళాశాల చైర్మన్ ఎంఎంఆర్వీ అప్పారావు మాట్లాడుతూ బాస్కెట్‌బాల్‌కు నూజివీడు పుట్టినిల్లన్నారు. దీని అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అనంతరం క్రీడాకారులను డీఎస్పీ శంకర్‌రెడ్డికి పరిచయం చేశారు. టోర్నమెంట్లో భాగంగా ప్రారంభమ్యాచ్ ఏబీఏ నూజివీడు, చిత్తూరు జట్ల మధ్య జరిగింది. స్థానిక పీజీ సెంటరు ప్రత్యేకాధికారి మండవ వెంకట బసవేశ్వరరావు, కోస్తాంధ్ర కార్యదర్శి ప్రసాద్, డీఏఆర్ ప్రిన్సిపాల్ గొల్లు వెంకటరామారావు, పీడీ అంజాద్‌ఆలీ తదితరులు పాల్గొన్నారు.