‘సాక్షి’ కథనానికి స్పందన
దేశాయిపేట, న్యూస్‌లైన్: బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగాడు జమ్మలమడక పిచ్చయ్యకు కూకట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈనెల ఒకటో తేదీన ‘సాక్షి’ మైదానం పేజీలో పిచ్చయ్య జీవితంపై ప్రచురితమైన ‘బాల్ బ్యాడ్మింటన్‌లో భీష్ముడు, కష్టాలలో అర్జునుడు’ కథనానికి క్రీడాకారులు, క్రీ డాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
ఆయనకు అన్నివేళలా తాము అండగా ఉంటామని లయన్స్ క్లబ్ కూకట్‌పల్లి శాఖ అధ్యక్షుడు కె. జయవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా పిచ్చయ్యకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పిచ్చయ్య క్రీడా ప్రతిభతోపాటు ఆయన కష్టాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసిన ‘సాక్షి’ కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి లయన్స్ క్లబ్ కార్యదర్శి ఆర్.ఈశ్వర్‌రెడ్డితోపాటు సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ ఎన్పీ డీసీఎల్ అధికారులు, శాప్ మాజీ డెరైక్టర్ రాజనాల శ్రీహరితోపాటు పలువురు పిచ్చయ్యకు ఆర్థిక సహాయాన్ని అందించారు.
పిచ్చయ్యకు లయన్స్ క్లబ్ సహాయం
Published Sat, Mar 8 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement