ముద్రిక కళా స్రవంతి ప్రారంభం
Published Sun, Jan 22 2017 11:56 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
కర్నూలు(అర్బన్): సాహిత్యంతో పాటు పలు రంగాల్లో అభిరుచి కలిగిన వారి కలయికతో ఆదివారం ముద్రిక కళా స్రవంతి అనే సంస్థ ప్రారంభమైంది. స్థానిక శిల్పా బిర్లా కాంపౌండ్‌లోని ముద్రిక ప్రింటర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రేగటి పాండురంగారెడ్డిని సంస్థ గౌరవాధ్యక్షుడిగా నియమిస్తూ సభ్యులు తీర్మానించారు. ఈ సందర్భంగా పరిమళానంద రచించిన ‘మాస్టర్‌తో మాటామంతి ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. డా.రాధాశ్రీ, మారేడు రాముడు, మద్దూరి రామ్మూర్తి, రథబంధ కవి చక్రపాణి, ముద్రిక అధిపతి పీవీ భాస్కర్, మాధవరావు, అక్రంబాషా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement