‘లయన్స్’ సేవలు అభినందనీయం
♦ మారుమూల గ్రామాల ప్రజలకు దగ్గర కావాలి
♦ తాండూరులో విజయ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా
♦ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
పెద్దేముల్: మారుమూల గ్రామాల్లో పేదలకు ఉచిత సేవ చేస్తూ.. వారి జీవితాలకు ఊపిరి పొయడం అభినందించదగ్గ విషయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జనగాం గ్రామంలో ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్యశిబిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సంస్థలు సేవా కార్యక్రమాలతోపాటు మొక్కలు నాటే కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హరితహారం, మిషన్ కాకతీయ, భగీరథ కార్యక్రమాలు ప్రారంభించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
తాండూరు పట్టణంలో రూ.10 లక్షలతో కంటి పరిక్షతోపాటు విజయ సెంటర్ ఏర్పాటు చేసి, అక్కడే ఆపరేషన్ కార్యక్రమాలకు స్థలం ఇవ్వాలని కొరగా వెంటనే స్పందించిన మంత్రి.. స్థలం ఇచ్చెలా చర్యలు తీసుకుంటానన్నారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. లయన్స్‌క్లబ్ సేవలు మరువలేన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తాము సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్లోళ్ల సువర్ణ, తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి రవీందర్‌రెడ్డి, బస్సప్ప, హైదరాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 25 మందికి కంటి శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్‌కు తరలించారు.