minister mahendar reddy
-
‘లయన్స్’ సేవలు అభినందనీయం
♦ మారుమూల గ్రామాల ప్రజలకు దగ్గర కావాలి ♦ తాండూరులో విజయ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా ♦ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పెద్దేముల్: మారుమూల గ్రామాల్లో పేదలకు ఉచిత సేవ చేస్తూ.. వారి జీవితాలకు ఊపిరి పొయడం అభినందించదగ్గ విషయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జనగాం గ్రామంలో ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్యశిబిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సంస్థలు సేవా కార్యక్రమాలతోపాటు మొక్కలు నాటే కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హరితహారం, మిషన్ కాకతీయ, భగీరథ కార్యక్రమాలు ప్రారంభించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. తాండూరు పట్టణంలో రూ.10 లక్షలతో కంటి పరిక్షతోపాటు విజయ సెంటర్ ఏర్పాటు చేసి, అక్కడే ఆపరేషన్ కార్యక్రమాలకు స్థలం ఇవ్వాలని కొరగా వెంటనే స్పందించిన మంత్రి.. స్థలం ఇచ్చెలా చర్యలు తీసుకుంటానన్నారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, జిల్లా పశుగణాభివృద్ధి సంఘం చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. లయన్స్‌క్లబ్ సేవలు మరువలేన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తాము సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్లోళ్ల సువర్ణ, తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి రవీందర్‌రెడ్డి, బస్సప్ప, హైదరాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 25 మందికి కంటి శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
ఉద్యమకారులకు పెద్ద పీట
మంత్రి మహేందర్‌రెడ్డి శంషాబాద్: నామినేటెడ్ పదవుల కేటాయింపులో ప్రభుత్వం ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. నార్సింగి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులైన మంచర్ల మమతాశ్రీనివాస్‌కు పదవి కేటాయించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నూతన పాలకవర్గ సభ్యులు మంత్రి మహేందర్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మార్కెట్ కమిటీ రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పాలకవర్గ సభ్యులు పారదర్శకమైన సేవలనందించి మంచి గుర్తింపును పొందాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి మంచర్ల శ్రీనివాస్, నాయకులు కె. చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొలను మహేందర్‌రెడ్డి, దూడల వెంకటేష్‌గౌడ్, రమేష్, దండు ఇస్తారి, చిన్నగండు రాజేందర్, మొహన్‌రావు, అంజయ్య, రాజునాయక్, రమేష్‌గౌడ్, దీప, హన్మంతు, మల్లేష్, పాశం శ్రీధర్, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
అందరి డిమాండ్లు నెరవేర్చడం అసాధ్యం
♦ కోట్‌పల్లి మండలం ఏర్పాటుపై మరోసారి సీఎంకు విన్నవిస్తా ♦ ఆసరా ఫింఛన్ల అవకతవకల్లో బాధ్యులపై చర్యలు ♦ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు: జిల్లాల పునర్విభజనలో భాగంగా అందరి డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వానికి సాధ్యం కాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరులో శుక్రవారం జరిగిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశానికి మంత్రి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చేవెళ్లను జిల్లా కేంద్రం, మెయినాబాద్, షాబాద్ తదితర ప్రాంతాలను శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలని స్థానిక ప్రజలు చేస్తున్న ఆందోళనలపై విలేకరులు మంత్రిని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కేంద్రం చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం జిల్లాగా ఏర్పాటు చేసిందన్నారు. చేవెళ్లను చేయాలని ప్రజలు కోరడం తప్పు కాదని, అందరి డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదన్నారు. కోట్‌పల్లిని మండలంగా చేయాలని మొదట తానే ప్రతిపాదించినట్టు చెప్పారు. 30-35 వేల జనాభా ఉంటే మండలంగా చేయడానికి వీలుందని, కోట్‌పల్లిలో 1 8వేల జనాభా మాత్రమే ఉందన్నారు. మండలం కాకుండా తాను అడ్డుపడ లేదన్నారు. బంట్వారం మండలం నుంచి చుట్టు పక్కల గ్రామాలను కలిపి కోట్‌పల్లిని మండలంగా ఏర్పాటు చేయడానికి మరోసారి సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తానన్నారు. తాండూరు మున్సిపాలిటీలో ఆసరా పింఛన్ల అవకతవకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరున్నా తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. పక్కదారి పట్టిన ఫించన్ డబ్బులను రికవరీ చేయడంతోపాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వానికి లేఖ రాస్తానని మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ప్రకటించడాన్ని మంత్రి స్వాగతించారు. -
అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి
♦ మున్సిపాలిటీల్లో ఇంటికో మొక్క నాటాలి ♦ జిల్లాలో పదికోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం ♦ తాండూరులో మొక్క నాటిన మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు: తెలంగాణలో అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, అందుకే ప్రభుత్వం హరితహారం చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పీ.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అడవుల విస్తీర్ణం పెరగటంవల్ల భవిష్యత్తులో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని పది జిల్లాలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో 1.20 లక్షల మొక్కలు నాటాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు మంత్రి చెప్పారు. తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెంచడానికి ఆయా జిల్లాల్లో అధికంగా మొక్కలు నాటనున్నట్టు వివరించారు. మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఇంటికో మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.నాటిన మొక్కలను సంరక్షించడం బాధ్యతగా ప్రజలందరూ భావించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు ప్రజలు, స్వచ్ఛంధ సంస్థలు సినీనటులు హరితహారంలో భాగస్వామ్యం కావడం మంచి పరిణామమన్నారు. జిల్లాలో పదికోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. అంతకుముందు మంత్రి హరితహారం పతకాన్ని ఆవిష్కరించి, పావురాన్ని ఎగురవేసి, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, వైస్ చైర్మన్ సాజిద్ అలీ, టీఆర్ఎస్, టీడీపీ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్లు అబ్దుల్ రజాక్, సుమిత్‌కుమార్‌గౌడ్, కౌన్సిలర్లు నీరజ, పరిమళ, శోభారాణి, అబ్దుల్ఖని, వాలిశాంత్కుమార్, అరవింద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్, ఇంజినీర్ సత్యనారాయణ, ఏఈ శ్రీను, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనంతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రవూఫ్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అధ్యక్షులు జగదీశ్వర్, హాదీ, నాయకులు జుబేర్‌లాల, బోయరాజు, కళాశాల, పాఠశాలల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు -
‘సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ భేష్’
యాప్రాల్: ముస్లిం మైనారిటీల సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశంలోనే పేరుతెచ్చుకుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాప్రాల్‌లోని కిందిబస్తీలో సోమవారం ఉదయం ఆయన మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 120 ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించినట్లు వివరించారు. జిల్లాలో మైనారిటీ విద్యార్థులకు రూ.180 కోట్లతో 9 పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షాదీముబారక్ పథకం కింద జిల్లాకు చెందిన 5,700 మంది యువతుల పెళ్లిళ్లకు రూ.51వేల చొప్పున అందజేసినట్లు చెప్పారు.