ఉద్యమకారులకు పెద్ద పీట | more importance to special leaders | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులకు పెద్ద పీట

Published Sat, Sep 3 2016 11:15 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఉద్యమకారులకు పెద్ద పీట - Sakshi

ఉద్యమకారులకు పెద్ద పీట

మంత్రి మహేందర్‌రెడ్డి
శంషాబాద్‌: నామినేటెడ్‌ పదవుల కేటాయింపులో ప్రభుత్వం ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పి. మహేందర్‌రెడ్డి అన్నారు. నార్సింగి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులైన మంచర్ల మమతాశ్రీనివాస్‌కు పదవి కేటాయించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో శనివారం నూతన పాలకవర్గ సభ్యులు మంత్రి మహేందర్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మార్కెట్‌ కమిటీ రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పాలకవర్గ సభ్యులు పారదర్శకమైన సేవలనందించి మంచి గుర్తింపును పొందాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి మంచర్ల శ్రీనివాస్‌, నాయకులు కె. చంద్రారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్ కొలను మహేందర్‌రెడ్డి, దూడల వెంకటేష్‌గౌడ్,  రమేష్‌, దండు ఇస్తారి, చిన్నగండు రాజేందర్‌, మొహన్‌రావు, అంజయ్య, రాజునాయక్‌, రమేష్‌గౌడ్‌, దీప, హన్మంతు, మల్లేష్‌, పాశం శ్రీధర్‌, వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement